వంశీ  ‘వెన్నెల్లో హాయ్ హాయ్’ కి  మోక్షం

Vamsi Venello Hai Hai Movie Released Today

09:59 AM ON 5th February, 2016 By Mirchi Vilas

Vamsi Venello Hai Hai Movie Released Today

ఒకప్పుడు తెలుగులో హాస్యకథల సినిమాలను ఇబ్బడి ముబ్బడిగా అందించిన దర్శకుడు వంశీ 25వ సినిమాకు పట్టిన గ్రహణం ఎట్టకేలకు వీడింది. రిలీజ్ కి మోక్షం లభించింది. 1980-90ల దశకంలో స్టార్ దర్శకుడుగా వంశీ ఓ ఊపు ఊపేసాడు. హాస్య చిత్రాలు , వైవిధ్య భరితమైన చిత్రాలు అందించిన వంశీ మంచి రచయిత కూడా. ఎపిలోని తూర్పు గోదావరి జిల్లా పసలపూడి గ్రామానికి చెందిన వంశీ, 'పసలపూడి కధలు' అందించారు. ఇక ‘సితార’, ‘అన్వేషణ’, ‘ఆలాపన’ ‘ఏప్రిల్ 1 విడుదల’, ‘చెట్టుకింద ప్లీడర్’, ‘లేడీస్ టైలర్’ లాంటి స్టొరీ బేస్డ్ చిత్రాలు అందించిన వంశీ కామెడీ సినిమాలు దర్శకుడిగా చేసిన సినిమాలు హిట్ కొట్టాయి. ‘అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమా తర్వాత ఎక్కువగా ప్రేమకథలనే తెరకెక్కించిన వంశీ 25వ సినిమా గా ‘వెన్నెల్లో హాయ్ హాయ్’ ఆరంభించాడు.

‘వెన్నెల్లో హాయ్ హాయ్’ చాలాకాలం క్రితమే పూర్తయినప్పటికీ ఈ సినిమా విడుదల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చింది. గత రెండు నెలలుగా సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూసిన ఈ సినిమా చివరకు ఈ శుక్రవారానికి ఫిక్స్ అయింది. సినిమా వాళ్లకు శుక్రవారం సెంట్ మెంట్ తెల్సిందేగా. ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న వంశీ ‘వెన్నెల్లో హాయ్ హాయ్’ లో అజ్మల్, నిఖితా నారాయణ్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను డి.వెంకటేష్ నిర్మించారు. వంశీ మార్క్ ప్రేమకథగా ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని నిర్మాత నమ్మకంగా వున్నాడు. వంశీ రజతోత్సవ చిత్రం ఎలా వుంటుందో మరి.

English summary

Tollywood Director Vamsi 25th film "Venello Hai Hai " was going to be released today.This was him 25th film and in this movie Hero Ajmal and heroine Nekitha Narayanan acted together.