ఫేస్‌బుక్ పోస్ట్‌తో మగవెధవలకి భలే బుద్ధి చెప్పింది

Vanaja Vasudev gave shocking reply to facebook abusers

05:30 PM ON 29th August, 2016 By Mirchi Vilas

Vanaja Vasudev gave shocking reply to facebook abusers

ఈ అమ్మాయి ఫేస్ బుక్ లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఇంతకీ అంత సంచలనమైన పోస్ట్ ఆమె ఏం పెట్టింది? అనే దానిపై విషయంలోకి వెళితే.. 14 సెకన్ల పాటు రెప్పార్పకుండా మహిళను చూసిన పురుషుల మీద కేసు పెట్టొచ్చని కేరళ ఎక్సైజ్ కమిషనర్ రిషిరాజ్ సింగ్ ఓ స్టేట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ కామెంట్ పై స్పందించిన ఓ కేరళ అమ్మాయి తన ఫేస్ బుక్ లో రిషిరాజ్ కు దిమ్మతిరిగే రిప్లే ఇచ్చింది. ఆ పోస్టుకు చాలా అసభ్యకరంగా రిప్లేలు వచ్చినా ఆమె కుంగిపోకుండా అంతకంటే బలమైన రిప్లేతో వారి నోళ్లు మూయించింది. ఇప్పుడు ఆమె పోస్ట్ ఫేస్ బుక్ లో సంచలనం సృష్టిస్తోంది.

1/5 Pages

విషయంలోకి వెళితే.. వనజ వాసుదేవ్. కేరళలోని అలప్పుజ నివాసి. ఆగస్టు 16న రిషిరాజ్ సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్పై ఆమె స్పందిస్తూ 14 సెకన్లపాటు పురుషుడు ఒక స్త్రీని చూసినంత మాత్రాన అతని మీద కేసు ఫైల్ చేయటం అసమంజసమని చెప్పింది. దీనిపై ఆమె స్పందిస్తూ పబ్లిక్ ప్లేస్ లో తనను మగవాళ్లు చూడడాన్ని ఎంజాయ్ చేస్తానని అయితే వారు ఎంత సేపు చూడాలనే దానికి సరైన కొలమానం ఏంటని ఆమె ప్రశ్నించింది. ఆమె పోస్టుకు చాలా మంది పురుషుల నుంచే ఘాటైన రిప్లేలు వచ్చాయి. కొంతమందైతే ఆమెను వ్యభిచారుల కోవలోకి తోసేశారు.

English summary

Vanaja Vasudev gave shocking reply to facebook abusers. Kerala girl Vanaja Vasudev gave shocking reply to facebook abusers.