వర్మకి అభిమానుల వార్నింగ్‌!!

Vangaveeti fans given threat messages to Ram Gopal Varma

05:23 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Vangaveeti fans given threat messages to Ram Gopal Varma

సెన్సేషనల్ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ ఏం చేసినా సెన్సేషన్ ఏ, అందుకే ఎప్పుడు చూసినా ఏదొకటి చేసి వార్తల్లో నిలుస్తాడు. వర్మ తాజాగా తెరకెక్కించిన 'కిల్లింగ్‌ వీరప్పన్‌' కన్నడలో విడుదలై సూపర్‌హిట్‌ విజయం సాధించింది. తెలుగులో కూడా ఈ వారంలో విడుదలవబోతుంది. ఈ విజయోత్సాహంతో వర్మ మరో సెన్సిటీవ్‌ సబ్జెక్ట్‌కు తెర లేపారు. ఈసారి విజయవాడ రాజకీయ వేత్త అయిన వంగవీటి మోహన రంగా-దేవినేని రాజశేఖర్‌ మధ్య జరిగిన గొడవలు నేపధ్యంలో సినిమా తెరకెక్కించబోతున్నాని ప్రకటించాడు. వంగవీటి రంగా ఎలా ఎదిగాడు? అతను ఎలా అంతమయ్యాడు అని తెర పై చూపిస్తానని వర్మ ప్రకటించాడు.

ఈ విషయం ప్రకటించిన 24 గంటలు గడవక ముందే వర్మకు థ్రెట్‌ మెసెజ్‌లు వచ్చాయి. అవి ఏంటంటే అసలు ఇలాంటి కథని ఎంచుకున్నావ్‌ బ్రతకాలని లేదా? రంగాని ఎవరు ఏ అవసరాల కోసం చంపారో తెలుసు కదా! వాటిని యథాతధంగా రూపొందించ లేకపోయావో నువ్వు ఇంక ఖతమ్, అతని లానే నువ్వు చస్తావ్‌. రంగాకి ఇప్పటికీ అభిమానులు ఉన్నారు, నువ్వేమైనా తేడా చేస్తే వాళ్లు వచ్చి నీ అంతు చూస్తారని వర్మకి ట్విట్టర్‌లో మెసేజ్‌ చేశారు. వర్మకు ఇలాంటి మెసేజ్‌ లేమీ కొత్త కాదు. 'రక్త చరిత్ర' చిత్రీకరణ సమయంలో కూడా వర్మకి ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.

అయినా వాటికేమీ భయపడకుండా వర్మ రక్త చరిత్రని విజయవంతంగా చిత్రీకరించి విడుదల చేశాడు. ఇప్పుడు కూడా అలానే బెదిరింపులు వస్తున్నాయి. మళ్లీ అప్పటిలానే ముందుకు దూసుకెళ్లడం ఖాయం.

English summary

Vangaveeti fans given threat messages to Ram Gopal Varma in Twitter.