సంచలనం సృష్టిస్తున్న 'వంగవీటి' షాట్స్(వీడియో)

Vangaveeti movie shots

12:03 PM ON 12th October, 2016 By Mirchi Vilas

Vangaveeti movie shots

బెజవాడ కాపు నాయకుడు వంగవీటి రంగా జీవిత కథ ఆధారంగా వర్మ తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే కొన్ని వీడియోలను రిలీజ్ చేసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో వీడియో షాట్ ను విడుదల చేశాడు. మ్యాగజైన్ లో కొన్ని ఫోటో స్టిల్స్ ఇచ్చినట్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదటిసారిగా కొన్ని వీడియో షాట్లు అంటూ ట్విట్టర్ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. కాగా ఇదివరకే వర్మ ఇవాళ రిలీజ్ చేయబోయే వంగవీటి షాట్స్ గురించి ఉదయమే ఓ ట్వీట్ చేశాడు. దుర్గమ్మ ఆశీస్సుల కోసం అక్టోబర్ 11న సాయంత్రం 5 గంటలకు కాపు కాచే కమ్మనైన వంగవీటికి సంబంధించిన కొన్ని ధృవ తారల్లాంటి మామూలు షూట్లు నెట్ లో పెడుతున్నట్లు ప్రకటించాడు.

కరెక్టుగా అదే సమయానికి ట్విట్టర్ ఖాతా ద్వారా వంగవీటి సినిమాకు సంబంధించి కొన్ని షాట్లకు సంబంధించి 3.30 నిమిషాలు నిడివిగల వీడియో నెట్లో ఉంచాడు. ఈ షూట్స్ చూసిన నెటిజన్లు, ఆర్జీవి అభిమానులు ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తున్నారు. వంగవీటి సినిమాకు సంబంధించి షాట్లు ఇవి. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కెయ్యండి.

English summary

Vangaveeti movie shots