సంచలనం రేపుతున్న వంగవీటి టైటిల్‌ సాంగ్‌

Vangaveeti movie title song

03:54 PM ON 26th February, 2016 By Mirchi Vilas

Vangaveeti movie title song

వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ పొలిటికల్‌ లీడర్‌ వంగవీటి రంగా జీవితం ఆధారంగా 'వంగవీటి' అనే సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన లోగోను నిన్న విడుదల చేయగా తాజాగా మరో ఆడియో సాంగ్‌ని తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా విడుదల చేశాడు. 'వంగవీటి' టైటిల్‌ సాంగ్‌ని 'సిరాశ్రీ' రచించగా, ఈ చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ శుసర్ల రాజశేఖర్‌ ఈ పాటని పాడారు. విజయవాడలో కాపు-కమ్మ మధ్య జరిగిన యదార్ధ రాజకీయ గొడవల్ని రామ్‌గోపాల్‌ వర్మ యధాతధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం స్టిల్స్‌, లోగోలు ఈ చిత్రం పై భారీ అంచనాలు రేపాయి. ప్రస్తుతం వర్మ వంగవీటి కుటుంబంలో జరిగిన కొన్ని విషయాలు తెలుసుకోవడానికి విజయవాడ చేరుకున్నాడు.

1/7 Pages

English summary

Sensational director Ram Gopal Varma released Vangaveeti movie title song in his twitter. This song is written by Sirasri.