'భయపడితే రౌడీ అవ్వడు' వంగవీటి ట్రైలర్(వీడియో)

Vangaveeti movie trailer

12:45 PM ON 3rd October, 2016 By Mirchi Vilas

Vangaveeti movie trailer

వివాదాస్పద ట్వీట్ లతో వెర్రెక్కించే, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిజ జీవితకథల ఆధారంగా సినిమాలు తీయడంలో ముందుంటాడు. ముఖ్యంగా నేరచరిత్ర ఉన్న వ్యక్తుల కథలను సినిమాలుగా తీయడానికి ఆయన బాగా ఆసక్తి చూపుతారు. ఇలా వచ్చినవే 'రక్తచరిత్ర', 'కిల్లింగ్ వీరప్పన్' తదితర చిత్రాలు. రాజకీయ నాయకుడు వంగవీటి మోహన రంగా జీవితం ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'వంగవీటి' చిత్రం 'కాపు కాసే శక్తి' ట్యాగ్ లైన్ తో వుంది. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ ను వర్మ శనివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్రైలర్ ను విడుదల చేశారు. శాంతి దూతగా పేరొందిన గాంధీ జయంతి రోజున హింసాత్మకమైన వంగవీటి ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు వర్మ ట్వీట్ చేసాడు. భయపడేవాడెవ్వడూ రౌడీ అవ్వలేడు అంటూ ట్రైలర్ ప్రారంభమవుతోంది.

ఇది కూడా చదవండి: 'గుంటూరు టాకీస్ 2' లో సన్నీ లియోన్?!

ఇది కూడా చదవండి: పెళ్ళికి ముందు ఆడవాళ్ళలో.. మగవాళ్ళు కచ్చితంగా చెక్ చెయ్యవల్సిన క్వాలిటీస్!

ఇది కూడా చదవండి: షాకింగ్ న్యూస్: నత్త విషం తాగితే ఆ రోగం తగ్గిపోతుందట!

English summary

Vangaveeti movie trailer. Ram Gopal Varma's Vangaveeti movie trailer creating sensation.