దేవినేని పై వంగవీటి  ఫైర్ 

Vangaveeti Radha Fires On Devineni Nehru

02:48 PM ON 26th December, 2015 By Mirchi Vilas

Vangaveeti Radha Fires On Devineni Nehru

ఇటివల కొంతకాలంగా మౌనంగా వున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వంగవీటి రాధా కృష్ణ (రాధా) మళ్ళీ తెరపైకి వచ్చారు. అది కూడా వర్గ పోరు నేపధ్యంలోనే. కాంగ్రెసు నాయకుడు దేవినేని నెహ్రూ పై ఫైర్ అయ్యారు రాధా. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో రాజకీయం మరోసారి వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. మాతో పెట్టుకునేందుకు మీరు సిద్ధమా అంటూ దేవినేని నెహ్రూకు ఆయన సవాల్ విసిరారు. వంగవీటి , దేవినేని కుటుంబాల మధ్య చాలాకాలంగా పోరు నడుస్తోంది.

మాజీ ఎంపి చేగొండి హరిరామ జోగయ్య ఇటీవల రాసిన ఆత్మకధలో రంగా హత్య కు సంబంధించి ఎపి సిఎమ్ చంద్రబాబు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం , దీనిపై సంచలనం రేగడం , ఆదశలోనే ఇటీవల కాలంలో నెహ్రూ చేసిన వ్యఖలపై వంగవీటి రాధా సీరియస్ అయ్యారు . మాజీ శాసనసభ్యుడు వంగవీటి మోహన రంగా 27వ వర్ధంతి సందర్భంగా శనివారం విజయవాడ నగరంలోని రాఘవయ్య పార్క్ సెంటర్‌లోని ఆయన విగ్రహానికి కుమారుడు వంగవీటి రాధా పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాధా - రంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో చేపట్టి పలు సేవా కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ తన తండ్రి వంగవీటి మోహనరంగాపై దేవినేని నెహ్రూ పిచ్చి వాగుడు మానుకోవాలని అన్నారు. చనిపోయినవారి గురించి మాట్లాడటం హీరోయిజం అనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇంట్లో కూర్చొని కనుసైగలతో రాజకీయం చేస్తున్నట్లు..పిచ్చి భ్రమల్లో బతుకుతున్నారని వంగవీటి రాధాకృష్ణ ఆరోపించారు. . తమ మౌనాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు. తాము ఇప్పటికే చాలా నష్టపోయామని, మళ్లీ నష్టపోయేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. వంగవీటి మోహన రంగా ప్రజా నాయకుడని ఆయన అన్నారు. రంగా పై విమర్శలు చేసే అర్హత ఎవరికీ లేదన్నారు. తన తండ్రి రంగాపై అసంబద్ధమైన విమర్శలు ఎవరు చేసినా సహించబోమన్నారు. ఏం నరుకుతావు అని నెహ్రూ నుద్దేశించి వంగవీటి రాధాకృష్ణ ప్రశ్నించారు. దేవినేని నెహ్రూ వల్లే తమ కుటుంబం నష్టపోయిందని ఆయన పేర్కొంటూ, తాము దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు.

English summary