వర్మకు వార్నింగ్‌ ఇచ్చిన వంగవీటి తనయుడు!!

Vangaveeti Radha warns Ram Gopal Varma

05:53 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Vangaveeti Radha warns Ram Gopal Varma

'కిల్లింగ్‌ వీరప్పన్‌' పై వచ్చిన స్పందనతో రామ్‌గోపాల్‌ వర్మ చాలా ఆనందంగా ఉన్నాడు. ఈ సినిమా పై మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీ బాక్సాఫీసు వద్ద వసూళ్ళు రావటానికి ఇది సరిపోతుంది. రామ్‌గోపాల్‌ వర్మ చాలామంది ప్రముఖుల మరియు విమర్శకుల ప్రశంసలు కూడా పొందాడు. కిల్లింగ్‌ వీరప్పన్‌ విజయం తరువాత వర్మ వంగవీటి మోహన్‌రంగ జీవిత చరిత్ర ఆధారంగా మరో సినిమా తీస్తానని ప్రకటించాడు. ఈ విషయం పై మోహన్‌రంగ కుమారుడు రాధ స్పందించాడు. సినిమాలో వాస్తవాన్ని చూపిస్తే తనకెలాంటి అభ్యంతరం లేదని అంతే కానీ, రంగ జీవితాన్ని చెడు కోణంలో చిత్రీకరిస్తే మాత్రం తను చూస్తూ ఊరుకోనని చెప్పాడు.

ఈ విషయం పై తనకన్నా ఎక్కువగా రంగ అభిమానులు స్పందిస్తారనీ అభిమానులు ఏవిధంగా స్పందించినా నేను బాధ్యుడిని కానని ఆయన స్పష్టం చేశారు. తమ ఇంటి పేరుతో కామెడీ చేస్తే అభిమానులు ఊరుకోరని, దీనివల్ల వర్మ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడని రాధ తెలిపాడు. వర్మ ఏదో ఒక పక్షం వైపు మాత్రమే మొగ్గు చూపుతూ పక్షపాతంగా వ్యవహరిస్తాడని రాధ అన్నాడు. ఓ ప్రైవేట్‌ టివీ చానల్‌ లో జరిగిన ఇంటర్‌వ్యూ లో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకూ వర్మ తనని కానీ, తన కుటుంబ సభ్యులను కానీ సంప్రదించలేదని ఆయన చెప్పాడు.

English summary

Vangaveeti Radha warns Ram Gopal Varma for his father Vangaveeti Mohan Ranga life history as to direct the movie by Varma.