భార్యభర్తలే కానీ  ప్రేమ పక్షులై - విడాకులకు వెళ్ళారు

Variety Incident In Uttarpradesh

11:05 AM ON 3rd February, 2016 By Mirchi Vilas

Variety Incident In Uttarpradesh

వారిద్దరూ భార్యాభర్తలే .. ప్రేమించుకున్నారు.. ప్రేమించి పెళ్లి చేసుకోకుండా పెళ్లి చేసుకున్నాక ప్రేమించుకున్న తీరు మాత్రం కానేకాదు. ఏమిటి మతలబు అనుకుంటే, మరి అక్కడే ఉంది అసలు కిటుకు. వారు ప్రేమించుకుంది మారు పేర్లుతో, అది కూడా సోషల్‌ మీడియాలో ఎక్కౌంట్ లు తెరిచి. చివరికి అలా పెరిగిన ప్రేమ వారి జీవితాన్ని నాశనం చేసి, విడాకుల దాకా తెచ్చేసింది. సినిమా కధలకు , నవలా రచయితలకూ అందని ఈ కధ ఆసక్తికరంగా వున్నా, కనువిప్పు కల్గించే ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే,...

ఉత్తరప్రదేశ్‌లోని బరేలి ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు సోషల్‌ మీడియాలో వేరే వేరు ఐడీలు, పేర్లతో ఖాతాలు తెరిచారు. ఒకరికి తెలియకుండా ఒకరు మారుపేర్లతో తెరిచిన ఈ ఖాతాలతో చాటింగ్‌ చేసేవారు. కనీసం ఒకరికొకరు గుర్తుపట్టకుండా ఉండండం వలన చాటింగ్‌ జోరు పెరిగింది. పెళ్లి కాలేదని ఇద్దరూ కూడా స్టేటస్ పెట్టుకోవడంతో, మెసేజ్‌ల పర్వం ఊపందుకుంది. మొత్తానికి ఆరు నెలల పాటు సాగిన వారి ప్రేమాయణానికి ముక్తాయింపు ఇవ్వాలన్న నిర్ణయంతో ఒక రోజు కలుసుకుందాం అని ఇద్దరూ అనేసుకున్నారు. అలా వారు ఎదురుచూసిన ఆ శుభ రానే వచ్చింది. అనుకున్న సమయానికి అనుకున్న చోట, పాపం ఈ పెళ్ళైన ప్రేమ పక్షులు కలుసుకుని నిర్ఘాంత పోయారు.. ఇంతకాలం నడిపిన చాటుమాటు వ్యవహారం బట్టబయలు అవ్వడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

English summary