పెళ్ళికి రాలేకపోతే ఇలా దీవిందండి.. ఆశ్చర్యపరుస్తున్న వెరైటీ శుభలేఖ!

Variety wedding card for marriage

04:00 PM ON 14th September, 2016 By Mirchi Vilas

Variety wedding card for marriage

పెళ్ళి అంటే నూరేళ్ళ పంట... జీవితంలో ఒకసారి మాత్రమే జరిగే ఈ శుభకార్యం సందర్భంగా బంధుమిత్రులంతా వచ్చి, వధూవరులను ఆశీర్వదించాలని అందరూ కోరుకుంటారు. సాధ్యమైనంత వేడుకగా జరుపుకుంటూ మధురానుభూతులను జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంటారు. అయితే ఈ మధ్య ఆప్యాయతలకన్నా ఆడంబరాలు ఎక్కువయ్యాయి. అన్నీ ఖరాయిదైనవే. ఎక్కడా రాజీ పడకూడదనే విధానం నడుస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సైతం ఆధునికంగా ఆలోచిస్తూ, వినూత్నంగా వ్యవహరిస్తున్న వాళ్ళూ వున్నారు. కొత్తదనం కోసం తహతహలాడుతున్నారు. వేదిక అలంకరణ దగ్గర నుంచి వధూవరులు, బంధువులు ధరించే వస్త్రాల వరకు అన్నిటిలోనూ ప్రత్యేకత చూపించాలనుకుంటున్నారు.

ఇటువంటి ప్రయత్నంలో భాగంగానే అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తేలా ఓ శుభలేఖ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. వివాహానికి హాజరుకావడం దగ్గర నుంచి స్వీట్లు, ఆశీర్వాదాల వరకు అన్నీ విభిన్నంగా ఉండేలా ఈ శుభలేఖలో వివరించారు. అంతేకాకుండా పర్యావరణంపై కూడా దృష్టి పెట్టారు. సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు రాలేకపోతే పేటీఎం లేదా ఆన్ లైన్ ద్వారా ఆశీర్వాదాలను పంపించవచ్చునని దీనిలో ఉంది. విందుకు హాజరు కాలేకపోతే మీ సమీపంలోని హల్దీరామ్స్ సొడెక్సో ద్వారా స్వీట్లు పొందవచ్చునని పేర్కొన్నారు. డిజిటలైజేషన్ ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంలో దేశానికి సహాయపడండి అనే నినాదం ఇందులో జోడించారు.

ఇది కూడా చదవండి: పాము కాటేస్తే చనిపోతాం.. అదే పాము విషం తాగితే ఏమౌతుందో తెలుసా?

ఇది కూడా చదవండి: షాకింగ్ న్యూస్: ముసలి నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్న అనుష్క!

ఇది కూడా చదవండి: అన్ని విమానాలకు తెలుపు రంగే ఎందుకు వేస్తారో తెలుసా?

English summary

Variety wedding card for marriage. A couple gave a variety wedding card to neighbours and relatives to reduce pollution.