చెన్నై వర్ష బాధితులకు ఆపన్న హస్తం ...

Various Celebraties help to the victims of the floods in Chennai

12:12 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Various Celebraties help to the victims of the floods in Chennai

వర్ష బీభత్సంతో అతలాకుతలమైన చెన్నై మహానగరంలో బాధితులను ఆఅదుకున్న , ఆదుకుంటున్న తీరు మానవ త్వానికి అడ్డహం పడుతున్నాయి. కులమతాలకు అతీతంగా మానవత్వ విలువలు చాటిచెబుతున్నాయి. కార్పోరేట్ సస్మ్తలు , వ్యక్తులు , సినీ నటీ నటులు , స్వచ్చంద సంస్థలు ఇలా చెన్నై వాసులకు ఎందరో ఆపన్న హస్తం అందిస్తునారు. ఇక వర్ష సమయంలో కొందరు తమ ఇళ్ళను ఆశ్రయం గా మలిచి , మనసు దోచుకున్నారు. బాధితులకు సాయం అందించడానికి సిఎమ్ జయలలిత ఎదుట అనేకమంది పారిశ్రామిక వేత్తలు బారులు తీరారు. ఇప్పటికే చాలామంది చేతనైనంత సాయం అందించారు కూడా. టివిఎస్ సంస్థల అధినేతలు శ్రీనివాసన్ , మల్లికా సినివాసన్ లు 3 కోట్ల రూపాయలు అందించారు. మాతా అమృతానందమయి పక్షాన సంస్థ ప్రతినిధులు 5 కోట్ల రూపాయలు అందించారు. ప్రముఖ బంగారు నగల వ్యాపారి జాయ్ అల్లుక్కాస్ రూ 3 కోట్లు, హుండాయ్ కార్ల కంపెనీ రూ 2 కోట్లు , ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ రూ 2 కోట్లు విరాళం అందించారు.

రూ 260కోట్ల భారీసాయం ప్రకటించిన కాగ్నిజెంట్ ....

అమెరికా కు చెందిన'కాగ్నిజెంట్ " ఐ టి సంస్థ రూ 260కోట్ల భారీ సాయాన్ని ప్రకటించింది. చెన్నైలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ కు సంబంధించి చెన్నై లోనే దాదాపు 60 వేల మంది పనిచేస్తున్నారు. విచిత్రమేమంటే కాగ్నిజెంట్ సంస్థలకు కూడా వర్షాల వలన పెద్ద నష్టమే జరిగింది. బాధితుల కడగండ్లు ప్రత్యక్షంగా చూసింది. అందుకే తక్షణం సాయం ప్రకటించింది. చెన్నై ను అన్ని విధాల ఆదుకుంటామని అభయం ఇచ్చింది. ప్రకటించిన సాయంలో 65 కోట్లు వెనువెంటనే అందించింది. మిగిలిన సొమ్మును శాశ్వత పునరావాస కార్యక్రమాలకు వెచ్చిస్తామని ప్రకటించింది.

కాపాడిన వాడే పేరే పెట్టుకున్న వైనం ....

చెన్నైలో భారీ వర్షాల నేపథ్యంలో మహ్మద్ యూనుస్ అనే యువకుడు తన రెండు ప్లాట్లలో ఎవరైనా ఉండొచ్చునని ఆహ్వానించాడు. ఆ ఆహ్వానం నచ్చి అక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపిన వారిలో చిత్ర - మోహన్ అనే హిందూ దంపతులు కూడా ఉన్నారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో వీళ్లు నివాసం ఉంటున్న ఉరప్పక్కం అనే ప్రాంతానికి వెళ్లి రక్షించేందుకు పడవల వాళ్లు ఆసక్తి చూపకపోవడంతో అతడు వారిని బతిమాలి పడవలను తీసుకుని వెళ్లి వారిని తన అపార్ట్మెంట్ కు తీసుకుని వచ్చి ఆశ్రయమిచ్చాడు. ఆ సమయంలో చిత్ర నిండు గర్బిణి. అక్కడ కరెంటు కూడా లేదు. చాలామంది జనం చెట్లమీద వేలాడుతున్నారు. పడవలో ఆ గర్బిణిని కొందరిని పడవ ఎక్కించుకుని వచ్చాడు. దారిలో పడవ ఒక చెట్టును ఢీకొని బయటపడింది. తర్వాత చిత్రను ఆస్పత్రిలో చేర్చగా ఆమె ఆడబిడ్డ కు జన్మ నిచ్చింది. . యూనస్ తోడ్పాటు వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని మోహన్ సంతోష పడడమే కాకుండా , తన భార్య - బిడ్డ ప్రాణాలు కాపాడిన యూనుస్ కు గుర్తుగా తమ బిడ్డకు యూనస్ అని పేరు పెట్టేసాడు. తాను చేసిన సహాయానికి మోహన్ దంపతులు స్పందించిన తీరుకు ఆశ్చ్యర్య పోయిన యూనస్ ఆ బిడ్డ చదువులకయ్యే ఖర్చు భరిస్తానని ప్రకటించడం కొసమెరుపు.

ఇంటిని పునరావాస కేంద్రంగా మలిచిన విశ్వనాధన్ ఆనంద్ ....

చదరంగ దిగ్గజం విశ్వనాధన్ ఆనంద్ ఏకంగా తన ఇంటిని పునరావాస కేంద్రంగా మలిచి , బాధితులకు చేయూతనిచ్చి , తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. చెన్నై లోని ఆర్ ఎ పురం లో నివసిస్తున్న విశ్వనాధన్ అతని నివాసానికి సమీమలోని మురికివాడల్లో నిలువ నీడ కోల్పోయిన 15 మందిని తన ఇందికి ఆహ్వానించి ఆశ్రయం కల్పించి , ఆహారం , దుప్పట్లు , దుస్తులు అందించాడు.

English summary

Various celebraties and MNC companies came forward to help chennai flood victims