వంగవీటి రాధా వ్యాఖ్యలకు వర్మ కౌంటర్ 

Varma Reverse Counter To Vangaveeti Radha

11:09 AM ON 1st February, 2016 By Mirchi Vilas

Varma Reverse Counter To Vangaveeti Radha

సాధారణంగా వివాదాస్పద అంశాల కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ , పబ్లిసిటీని తనవెనుక తిప్పుకునే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో వివాదానికి తెరలేపాడు. వంగవీటి రంగా పై సినిమా తీస్తానని ప్రకటించిన వర్మ పై 'సినిమా తేడాగా తీస్తే రంగా ఫ్యాన్స్‌ ఊరుకోరు' అంటూ ... వంగవీటి రాధాకృష్ణ చేసిన వార్నింగ్ హెచ్చరిక పై రాంగోపాల్‌వర్మ ఘాటుగానే స్పందిస్తూ , రాధాకు కౌంటర్‌ వార్నింగ్‌ ఇచ్చేసాడు. ఇప్పుడిది సంచలనమై , రసవత్తర చర్చకు దారితీస్తోంది.

' వంగవీటి రాధా కాపు అయి ఉండి కాపుల వెనుక దాక్కున్న... కమ్మ మనస్తత్వమున్న వాడని' అని వర్మ అనేసాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో వంగవీటి రాధ పై రాంగోపాల్‌వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'వంగవీటి రంగా గురించి రాధా కంటే తనకే ఎక్కువ తెలుసని, వంగవీటి రాధాకృష్ణ ఎంత పెరిగినా పిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడని.. వంగవీటి రంగా తనతో చెప్పే వారని' వర్మ ఆయన గుర్తు చేసుకున్నాడు. రాధా అసలు నీవు ఫ్లాష్‌ బ్యాక్ అర్ధం చేసుకో అని సూచించాడు.. రంగా కొడుకు రాధా, మాటల మనిషే తప్ప చేతల మనిషి కాదని వర్మ ఎద్దేవా చేసాడు. ఇక పెదనాన్న రాధా విలువలో ఒక శాతం అర్ధమైనా... మాటల రాధాగా మిగిలిపోయేవాడు కాదని రాంగోపాల్‌వర్మ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్య లు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. దీనిపై కౌంటర్ , ఎన్ కౌంటర్లు వుండే అవకాశం ఉందనే మాటలు వినిపిస్తున్నాయి.

English summary

Previously Ramgopal Varma Said that he was going to make a film on basis of the famous person Vangaveeti Mohana Ranga.Then Mohana Ranga Son Vangaveeti Radha Responds to Varma announcement and he warns Ram Gopal Varma by saying that if there were any wrong in the film then Varma have to face difficulties.Now RamGopal Varma Responded to Vangveeti Radha warning in twitter and says that Varma knows more about than Vangaveeti Radha