రోజుకో 'సింగిల్‌ ఎక్స్‌' పోస్టర్‌

Varma To Release Single X Poster Everyday

02:02 PM ON 16th February, 2016 By Mirchi Vilas

Varma To Release Single X Poster Everyday

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా వివాదమే. తను రోజు వార్తల్లో విలువడం కోసం ఏదొక తుంటరి పని చేస్తూనే ఉంటాడు. రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా సినిమాలపై దృష్టి వదిలేసి షార్ట్‌ ఫిలింస్‌పై దృష్టి పెట్టాడు. తాను ఎంతో ఇష్టంగా చిత్రీకరించిన సన్నివేశాలు సెన్సార్‌ వాళ్ళు కట్‌ చేసేస్తుండడంతో వర్మ ఈ బాటని ఎంచుకున్నాడు. ఆర్‌జీవి టాకీస్‌ తాను మొదట తెరకెక్కిస్తున్న షార్ట్‌ ఫిలిం 'సింగిల్‌ ఎక్స్‌'. ఈ చిత్రంపై హైప్‌ క్రియేట్‌ చేసేందుకు వర్మ దీనికి సంబందించి ఒక ఫస్ట్‌లుక్‌ ని విడుదల చేశాడు. వెనుక నుంచి దాదాపు మొత్తం తన అందాలని చూపిస్తున్న ఆ ఫోటోకి విపరీతమైన రాస్పాన్స్‌ వచ్చింది. ఆ తరువాత మొన్న వేలెంటైన్స్‌డే సందర్భంగా ఒకటి రిలీజ్‌ చేశాడు. అదీ అంతే బికినీలో కూర్చుని తన అందాలు మొత్తం బయటపెడుతున్న ఆ ఫోటోకు ఎన్నో వ్యూలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో లుక్‌ విడుదల చేశాడు. అరికాలు నుండి తొడల వరకు ఏమీ లేకుండా కనిపిస్తున్న ఈ ఫోటో యువతను బాగా అట్రాక్ట్‌ చేస్తుంది. అసలు ఆ షార్ట్‌ ఫిలింలో నిజంగా ఇలా అందాలు చూపిస్తాడో లేదో తెలీదు కానీ ఆ షార్ట్‌ ఫిలింని ఎంతో మంది చూసేలా మాత్రం హైప్‌ క్రియేట్‌ చేసుకున్నాడు వర్మ. అసలు ఆ షార్ట్‌ ఫిలింలో ఏముందో తెలియాలంటే వచ్చే వరకు ఆగాల్సిందే. ఈ ఫస్ట్‌లుక్‌ ని మీరు ఓ లుక్‌ వెయ్యండి.

English summary

Controversial Director Ram Gopal Varma was famous for controversies and free publicity for his movies.Recently he was making a short film and to release his short films in his youtube channel RGV Taslkies.Recently three movie posters were released which were going viral in internet