బెజవాడకు వర్మ     

Varma To Visit Vijayawada on 26th

05:13 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Varma To Visit Vijayawada on 26th

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఈనెల 26న విజయవాడ వెళ్తాడట. తెలుగులో తన ఆఖరి చిత్రంగా ‘వంగవీటి’ని రూపొందిస్తానని వెల్లడించిన వర్మ ఇందులో భాగంగా 30 ఏళ్ల కిందటి బెజవాడ పరిస్థితులను వర్మ ఈ చిత్రంలో చూపించబోతున్నాడు ఇప్పటికే ఈ చిత్రం తీయవద్దంటూ వంగవీటి రాధాకృష్ణ అభిమానుల. తరపున హెచ్చరిక చేయడం , వర్మ కూడా గట్టిగా కౌంటర్ ఎటాక్ ఇవ్వడం తెల్సిందే. ఇప్పటికే ఈ చిత్రంలో రాధా తాలూకు స్టిల్స్ విడుదలై ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమా కథకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకునేందుకు తాను విజయవాడ వెళ్లి పలువురిని కలవనున్నట్లు వర్మ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఎప్పుడూ ఏదో ఓ సంచలనం సృష్టించే వర్మ వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నాడు. వంగవీటి కధ లాంటి తన సినీ జీవితంలో అరుదైన కధగా ఇప్పటికే వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే.

English summary

Controversial Director Ram Gopal Varma To visit Vijayawada on 26th of this month.Previously he had announced that he was going to make movie based on the life story of Vangaveeti Mohana Ranga. Rangs son had given him warning and RGV also given counter to him and heat up this issue.