పడిపోయిన వరుణ్ గాంధి

Varun Gandhi Falls From Stage

09:48 AM ON 14th March, 2016 By Mirchi Vilas

Varun Gandhi Falls From Stage

బిజెపి ఎంపీ వరుణ్‌ గాంధీ ఓ సభలో వేదికపై నుంచి కిందపడిపోయారు. వరుణ్‌ పుట్టినరోజు కావడంతో మొరాదాబాద్‌-హరిద్వార్‌ రహదారిలోని ఛాజ్‌లెట్‌ ప్రాంతంలో ఆదివారం రైతులతో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వరుణ్‌ వేదికపైకి ఎక్కి మాట్లాడుతుండగా ఒక్కసారిగా వేదిక కూలిపోయింది. దీంతో ఆయనతో పాటు పలువురు నాయకులు కింద పడిపోయారు. ఈ ఘటన కారణంగా వరుణ్‌కి ఎలాంటి ప్రమాదం జరగలేదని మొరాదాబాద్‌ ఏఎస్పీ తెలిపారు. మొత్తానికి పెద్ద ప్రమాదమే తప్పింది.

English summary

BJP MP Varun Gandhi escapes from an accident.On the part of his birthday he was participated in a meting in Uttar Pradesh accidentally that stage collapses and along with Varun Gandhi some other leaders were also escapes from that Incident.