వరుణ్ సందేశ్ లవ్ మ్యారేజ్ డేట్ ఫిక్స్.. ఇదిగో శుభలేఖ

Varun Sandesh marriage date was fixed

11:10 AM ON 10th August, 2016 By Mirchi Vilas

Varun Sandesh marriage date was fixed

హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాతో ఒక్కసారిగా స్టార్డమ్ సొంతం చేసుకున్న అమ్మాయిల హార్ట్ బీట్ హీరో వరుణ్ సందేశ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత ఏడాది తన ప్రియురాలు హీరోయిన్ వితికా షేరుతో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. వరుస సినిమాల్లో నటిస్తూ ముందుకు దూసుకుపోయిన ఈ కుర్రాడికి ఆ తర్వాత కొన్ని సినిమాలు పరాజయం కావడంతో ఈ హీరోకి అవకాశాలు కరువయ్యాయి. ఇటీవలే 'పడ్డానండీ ప్రేమలో మరి' అంటూ ఒక సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ హీరోయిన్ వితికతో నిజంగానే ప్రేమలో పడి.. పెద్దలను ఒప్పించి.. ఆమెను పెళ్లిచేసుకోవడానికి రెడీ అయ్యాడు.

హైదరాబాద్ నగర శివార్లలోని అలంకృత రిసార్ట్ లో ఈ పెళ్ళి చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారట. ఆగస్టు 18వ తేదీ గురువారం రాత్రి 3.14 గంటలకు వీరి వివాహం అంగరంగ వైభవంగా జరుగబోతోంది. ప్రస్తుతం వరుణ్, వితిక వెడ్డింగ్స్ ఇన్విటేషన్స్ పంచే కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ చిత్రం భారీ విజయం సాధించడంతో వరుణ్ సందేశ్ మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన కొత్త బంగారు లోకం కూడా హిట్ కావడంతో వరుణ్ కి అవకాశాలు వెల్లువెత్తాయి. పెళ్లి తర్వాత తనకు కెరీర్ పరంగా కలిస్తుందని వరుణ్ సందేశ్ భావిస్తున్నాడట. అదండీ సంగతి.

English summary

Varun Sandesh marriage date was fixed