వరుణ్‌ సందేశ్‌ నిశ్చితార్ధం వేడుకలు..

Varun Sandhesh engagement details

08:28 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Varun Sandhesh engagement details

శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన 'హ్యాపీడేస్‌' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన యువకధానాయకుడు వరుణ్‌సందేశ్‌. ఆ చిత్రం విజయంతో హీరోగా కొత్త బంగారులోకం చిత్రంలో నటించి సూపర్‌హిట్‌ అందుకున్నాడు. ఆ తరువాత వరుసపెట్టి సినిమాలు చేశారు కానీ ఇప్పుడు కొన్ని ఫ్లాప్స్‌ రావడంతో కెరీర్‌ కొంచెం నెమ్మదించింది. కానీ కెరీర్‌ పక్కన పెడితే పర్సనల్‌ లైఫ్‌ విషయంలో వరుణ్‌ ఒక ఇంటివాడు అవుతున్నాడు. అది కూడా తను ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం విశేషం. 'ప్రేమ ఇష్క్‌ కాదల్‌' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన 'వితిక షేరు' ఆ తరువాత వరుణ్‌సందేశ్‌ సరసన 'పడ్డానండి ప్రేమలో' చిత్రంలో నటించింది.

అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్ళి పీటల వరకు దారితీసింది. వరుణ్‌ సందేశ్‌-వితిక షేరుల నిశ్చితార్ధ వేడుక డిసెంబర్‌ 7 న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో జరగనుంది. ఈ నిశ్చితార్శం కోసం ఉదయం 8.32కు సమయాన్ని ముహూర్తంగా నిర్ణయించారు.

English summary

Varun Sandhesh engagement details