ఫ్లాప్‌ డైరెక్టర్‌ తో 'వరుణ్‌ తేజ్‌'!!

Varun Tej new movie with Sreenu Vaitla

05:26 PM ON 16th December, 2015 By Mirchi Vilas

Varun Tej new movie with Sreenu Vaitla

ముకుంద, కంచె వంటి చిత్రాలతో అలరించిన వరుణ్‌తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'లోఫర్‌'. పూరీ జగన్నాధ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌ సరసన దిశా పటాని హీరోయిన్‌గా పరిచయమవుతుంది. అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్‌ 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల కాక ముందే మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఆగడు, బ్రూస్‌లీ వంటి వరుస ఫ్లాప్ చిత్రాలతో స్టార్‌ ఇమేజ్‌ను పోగొట్టుకున్న డైరెక్టర్‌ శ్రీనువైట్ల తో వరుణ్‌తేజ్‌ సినిమా చేయబోతున్నాడు. లోఫర్‌ ప్రొడ్యూసర్‌ సి. కళ్యాణ్‌ నిర్మాణంలో రెండు చిత్రాలు చేసేందుకు శ్రీనువైట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ముకుంద, కంచె, లోఫర్‌ చిత్రాలలో డిఫరెంట్‌ జోనర్‌లో నటించిన వరుణ్‌తేజ్‌ ఈ సారి కామెడీ యాంగిల్‌ని కూడా ట్రై చెయ్యాలనే ఉద్దేశంతో శ్రీనువైట్ల దర్శకత్వం లో చెయ్యడానికి అంగీకరించాడని తాజా సమాచారం.

English summary

Varun Tej new movie with Sreenu Vaitla and this movie is producing Loafer producer C. Kalyan.