చెల్లెమ్మ ఇరగదీసిందట

Varun Tej Praises Niharika

10:22 AM ON 17th May, 2016 By Mirchi Vilas

Varun Tej Praises Niharika

మెగా కుటుంబం నుంచి ఓ ఆడ పడుచు సినీ రంగ ప్రవేశం చేయడం ఆ కుటుంబంలో ఆనందం నింపుతోంది. మే 18న ''ఒక మనసు'' ఆడియో లాంచ్. అయితే కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి వస్తారో రారో తెలియదు కాని.. యంగ్ హీరోలు.. చరణ్ బన్నీ వరున్ తేజ్ సాయిధరమ్ మాత్రం వస్తున్నారట. తమ కజిన్ ను వారే లాంచ్ చేస్తారట. 'మా ఫ్యామిలీ అంతా ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాం. మాలో అందరికంటే చిన్న పిల్ల తనే. క్యూట్ లిటిల్ ప్రిన్సెస్. ఇప్పుడు చూడండి.. తెరమీద ఇరగదీస్తోంది. ఎంతో ప్రౌడ్ మూమెంట్ ఇది'' అని మెగా హీరో వరుణ్ తేజ్ అంటున్నాడు. తన సిస్టర్ నిహారిక కొణిదెల ''ఒక మనసు'' టీజర్ చూసి ఫుల్ ఫ్లాట్ అయిపోయాడట.

ఇవి కూడా చదవండి:'బ్రహ్మోత్సవం' స్పెషల్ షోకి పర్మిషన్

''నిహారిక ఇరగదీసింది. ఒక డెబ్యూ సినిమాలో అంతకంటే ఎవరు ఏం చేస్తారు చెప్పండి? చాలా ఇంప్రెసివ్ గా ఉంది. నిహాను అలా చూస్తే చాలా హ్యాపీగా ఉందని నాకు చరణ్ అన్న ఫోన్ చేసి చెప్పాడు. మా అందరి సపోర్టుతో... తను ఎప్పుడు తొలి రిలీజ్ ను చూస్తుందా అని ఎదురుచూస్తున్నాం'' అని వరుణ్ అన్నాడు. అంతే కాదు.. అసలు మెగా ఫ్యామిలీ అంతా కూడా తమ ఫ్యామిలీ నుండి వస్తున్న తొలి హీరోయిన్ కాబట్టి.. ఎలా ఇంప్రెస్ చేస్తుంది అనే టెన్షన్ లో ఉన్నారట. కాని ఇప్పుడు ఫుల్ హ్యాపీ అయిపోయారట.

ఇవి కూడా చదవండి:బ్రహ్మోత్సవానికి సెన్సార్ ఒకే

ఇవి కూడా చదవండి:ఓ రోజు ముందే ఎన్టీఆర్ వచ్చేస్తున్నాడు

English summary

Mega Brother Naga Babu's Son Varun Tej praises his sister Konidela Niharika for her acting in her debut Movie named "Oka Manasu". Niharika Acted along with Naga Showrya and Mega Heroes were going to attend to this movie audio launch event.