'ప్రేమమ్' హీరోయిన్ తో వరుణ్ తేజ్ రొమాన్స్

Varun Tej romancing with Sai Pallavi

11:17 AM ON 17th June, 2016 By Mirchi Vilas

Varun Tej romancing with Sai Pallavi

'లోఫర్' చిత్రం తరువాత వరుణ్ తేజ్ నటించబోతున్న తాజా చిత్రం గురించి సమాచారం బయటకొచ్చింది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు నిర్మించబోతున్న ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్ సరసన కేరళ కుట్టి సాయిపల్లవిని ఎంపిక చేసారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ చిత్రంలో మాలర్ పాత్రలో నటించి యువతలో అమితమైన క్రేజ్ సంపాదించుకున్న సాయిపల్లవికి తెలుగులో ఇది తొలి చిత్రం. ముకుంద, జ్యోతిలక్ష్మీ, క్షణం తదితర చిత్రాల్లో నటించిన సత్య దేవ్ ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర పోషించనున్నారు.

సినిమా గురించి దిల్ రాజు మాట్లాడుతూ శేఖర్ కమ్ముల ఓ వండర్ ఫుల్ స్టోరీ తీసుకొచ్చారు. ఇప్పటికే వరుణ్తేజ్ మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అమెరికాలో ఉండే అబ్బాయికి, తెలంగాణాలో పెరిగిన అమ్మాయికీ మధ్య జరిగే ప్రేమకథే ఈ చిత్రం. నాయిక పాత్రకు సాయిపల్లవి సరిగ్గా సరిపోతుందనే నమ్మకంతో ఆమెను తీసుకున్నాం. జూలై 25న చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఆగష్టు నెలాఖరుకి తెలంగాణా నేపథ్యం సన్నివేశాలన్నింటినీ పూర్తి చేస్తాం. అక్టోబర్ లో అమెరికాలో అక్కడి నేపథ్యం సన్నివేశాల్ని తీస్తాం. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. డిసెంబర్ లో చిత్రాన్ని విడుదల చేయాలనేది మా సంకల్పం అని చెప్పారు.

English summary

Varun Tej romancing with Sai Pallavi