సర్దార్ గబ్బర్‌సింగ్‌ లో వరుణ్‌ తేజ్‌

Varun Tej To Appear In Sardar Gabbarsingh

10:55 AM ON 28th December, 2015 By Mirchi Vilas

Varun Tej To Appear In Sardar Gabbarsingh

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్‌ గబ్బర్‌సింగ్‌. ఈ సినిమా కోసం అభిమానులందరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ ఘాటింగ్‌ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. 2016 వేసవిలో ఈ సినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు పవర్‌ సినిమాతో హిట్‌ కొట్టిన దర్శకుడు బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే సర్ధార్‌ గబ్బర్‌సింగ్‌ సినిమాలో వరుణ్‌తేజ్‌ కూడా కనిపించబోతున్నట్లు సమాచారం. వరుణ్‌తేజ్‌ సినిమాలకు ఈ మధ్య అంతగా హైప్‌ రావడం లేదు. వరుణ్‌తేజ్‌ ఆడియో ఫంక్షన్లకు కూడా పవన్‌కళ్యాణ్‌ రావడంలేదు. దీంతో వరుణ్‌తేజ్‌ కు క్రేజ్‌ తీసుకురావడానికి పవన్‌ సర్ధార్‌ గబ్బర్‌సింగ్‌ సినిమాలో వరుణ్‌ ను చూపించి పవన్‌ సపోర్టు వరుణ్‌ కు ఉందని నిరూపించాలని నాగబాబు భావిస్తున్నాడట. ఏది ఏమైనా పవన్‌కళ్యాణ్‌ సినిమాలో ఇలా మెగా హీరోలు కనిపిస్తే మెగా అభిమానులకు పండుగని చెప్పక తప్పదు.

English summary

Varun Tej To Appear In Sardar Gabbarsingh. This gossip spreading in film nagar. We didnt get any official confirmation from the Sardar team.