అమెరికా అబ్బాయి-తెలంగాణ అమ్మాయికి ముహూర్తం ఖరారు

Varun Tej upcoming movie starts

11:02 AM ON 3rd August, 2016 By Mirchi Vilas

Varun Tej upcoming movie starts

ఇది రియల్ స్టోరీయా అని అనుకోవచ్చు అవునో కాదో గానీ ఇది మాత్రం రీల్ స్టోరీ. వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే చిత్రానికి ముహూర్తం ఖరారయింది. ఆగష్టు 5న ఈ సినిమా ప్రారంభించడానికి నిర్ణయించారు. ఇక అదే రోజు ఈ సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారట. వరుణ్ తేజ్ లవ్ స్టోరీ చేయడం ఇదే మొదటి సారి. చిన్నచిన్న విషయాలను కూడా ఎమోషనల్ గా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయగలడు శేఖర్ కమ్ముల. కానీ థ్రిల్లర్ జానర్ లో నయనతారతో శేఖర్ కమ్ముల తీసిన హిందీ కహానీ రీమేక్ అనామిక ఫ్లాప్ అయ్యింది.

దాంతో తనకు అచ్చొచ్చిన ఎమోషనల్ డ్రామాతోనే హిట్ కొట్టాలని కసితో శేఖర్ కమ్ముల ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసాడు. అమెరికా అబ్బాయికి, తెలంగాణ అమ్మాయికి మధ్య సాగే ఎమోషనల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో అమెరికా అబ్బాయిగా వరుణ్, అలాగే తెలంగాణ అమ్మాయిగా సాయి పల్లవి నటిస్తున్నారట. ఇంచు మించు టైటిల్ కూడా ఇలానే ఉండొచ్చు.

English summary

Varun Tej upcoming movie starts