వరుణ్ తేజ్ "లోఫర్" ట్రైలర్ అదుర్స్

Varun Tej’s Loafer Trailer Launched

06:07 PM ON 9th November, 2015 By Mirchi Vilas

Varun Tej’s Loafer Trailer Launched

మెగా వారసుడు వరుణ్ తేజ్ ఇప్పటి వరకు చేసిన ముకుందా , కంచె చిత్రాలు మాస్ అభిమానులని పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి . తాజా గా వరుణ్ తేజ్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లోఫర్ అనే సినిమాను చేస్తున్నాడు. మాస్ సినిమాలను తనదైన శైలిలో తెరకెక్కించడంలో పూరి జగన్నాథ్ దిట్ట.

ఇటీవల లోఫర్ చిత్రం పోస్టర్లు , ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ లో " నేను పుట్టిందే నోక్కేయడానికి ..మధ్యలో ఆపితే తొక్కేస్తా " అంటూ వరుణ్ చెప్పిన డైలాగు కు మంచి రెస్పాన్స్ వస్తోంది .

వరుణ్ కి జంటగా దిశాపటాని నటించారు. మదర్ సెంటిమెంట్ నేపధ్యంలో సాగే ఈ చిత్రంలో వరుణ్ కి తల్లిదండ్రులుగా రేవతి, పోసాని నటించారు. హాస్య ద్వయం ఆలీ, బ్రహ్మానందంలతో కూడిన కామెడీ ట్రాక్ ను దర్శకుడు పూరి తనదైన శైలిలో రూపొందించినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ ట్రైలర్ ను చూస్తే వరుణ్ తేజ్ మాస్ అభిమానులను ఆకట్టుకునేల కనిపిస్తున్నాడు.ముకుంద ,కంచె సినిమాలు క్లాసు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి . నటన పరంగా వరుణ్ కు మంచి మార్కులను తెచ్చిపెట్టాయి . ఐతే ఏ హీరో కైనా మాస్ ఆడి యన్స్ కు కనెక్ట్ అయినప్పుడే స్టార్ డం వస్తుంది. వరుణ్ తండ్రి నాగబాబు సైతం తన కుమారుడికి అన్న చిరంజీవి మాదిరిగా మాస్ ప్రేక్షకులకు చేరువయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

English summary

Varun Tej’s Loafer Trailer Launched