ఫీల్‌మైలవ్‌ అంటున్న వరుణ్‌తేజ్‌!!

Varun Tej's new movie Feel My Love

01:26 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Varun Tej's new movie Feel My Love

సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన 'ఆర్య' చిత్రం ఎంత సూపర్‌ హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. అంతే కాదు ఈ సినిమానే అల్లు అర్జున్‌కు స్టార్‌ ఇమేజ్‌ను తెచ్చి పెట్టింది. అందులో పాపులర్‌ డైలాగ్‌ 'ఫీల్‌మైలవ్‌' అనే టైటిల్‌తో మెగా హీరోతో ఒక చిత్రం తెరకెక్కబోతోందని సమాచారం. నిర్మాత దిల్‌రాజు ఫిలిం ఛాంబర్‌లో ఫీల్‌మైలవ్‌ అనే టైటిల్‌ని రిజిస్టర్‌ చేయించాడు. ఆ విషయం బయటకొచ్చాక దేవీశ్రీప్రసాద్‌ హీరోగా నటిస్తున్న చిత్రం కోసం రిజిస్టర్‌ చేయించాడని అనుకున్నారంతా కానీ అది నిజం కాదు ఈ టైటిల్‌ని మెగా హీరో వరుణ్‌తేజ్‌ కోసం రిజిస్టర్‌ చేయించాడు దిల్‌రాజు.

ఈ చిత్రానికి నూతన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్‌వర్క్‌ జరుగుతోంది జనవరిలో సెట్స్ పైకి వెళ్తుంది అని తాజా సమాచారం. ఇంకా ఈ చిత్రానికి సంబంధించి తారాగణం తెలియాల్సి ఉంది.

English summary

Varun Tej's new movie Feel My Love which is directing by new director Venky Atluri and producing by Dil Raju.