క్రిష్‌ రాయబారిలో వరుణ్‌తేజ్‌ !

Varuntej once again acting in Krish direction

07:01 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

Varuntej once again acting in Krish direction

గమ్యం వంటి క్లాసికల్‌ హిట్‌తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దర్శకుడు క్రిష్‌. ఆ తరువాత వేదం, కృష్ణంవందేజగద్గురుమ్‌ వంటి మానవతా విలువలు ఉన్న చిత్రాలనే తీసి హిట్‌ అందుకున్నాడు. తాజాగా వరుణ్‌తేజ్‌తో 'కంచె' వంటి సూపర్‌హిట్‌ చిత్రం తీసి విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నాడు. ఈ చిత్రం సక్సెస్‌తో క్రిష్‌-అఖిల్‌ కాంబినేషన్ లో ఒక చిత్రం వస్తుందిని వార్తలొచ్చాయి. దీనితో పాటు క్రిష్‌ ఫిలిం చాబర్‌లో 'రాయబారి' అనే టైటిల్‌ని రిజిష్టర్‌ చేయించాక ఈ టైటిల్‌ అఖిల్‌తో చేసే చిత్రం కోసమే రిజిస్టర్ చేయించారు అనుకున్నారంతా.

కానీ ఆ ఊహలని తెర దించుతూ తాజా సమాచారం ఒకటి వెలువడింది. కంచెలో యుద్ధసైనికుడిగా వరుణ్‌తేజ్‌ని చూపించిన క్రిష్‌ ఈ సారి సీక్రెట్‌ ఏజెంట్‌గా చూపించనున్నాడు. యాక్షన్‌ - రొమాస్స్‌లతో పాటు థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉండేలా ఈ చిత్రాన్ని క్రిష్‌ తెరకెక్కించబోతున్నాడట.

English summary

Varuntej once again acting in Krish direction. The movie name is called Rayabaari and VarunTej is acting as a secret agent in this movie.