శ్రీ పంచమి / వసంత పంచమి

Vasant Panchami Celebrations in Basara

10:07 AM ON 12th February, 2016 By Mirchi Vilas

Vasant Panchami Celebrations in Basara

చదువుల తల్లి సరస్వతి దేవి కొలువైన ఆదిలాబాద్‌ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు బాసర చేరుకున్నారు.వేకువజామున 2గంటలకే సుప్రభాత సేవతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఆరంభించారు. మంగళవాయిద్యాల నడుమ మహాభిషేకం, అలంకరణ, నివేదన కార్యక్రమాలు నిర్వహించారు.. ఉదయం 5గంటల నుంచి చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. కాగా మాఘ శుద్ధ పంచమిని శ్రీ పంచమి, మదన పంచమి, వసంత పంచమి, సరస్వతీ జయంతి అని జరుపుటాకుంరు. జ్ఞానశక్తికి అధిష్టాన దేవత సరస్వతీదేవి. సరస్వతీదేవిని వేదమాతగా, వాగేశ్వరిగా, శారదగా అభివర్ణించారు. చదువుల తల్లి, అక్షరాల ఆధిదేవత, విద్యాధిదేవత, పుస్తకపాణి, జ్ఞానప్రదాయిని, సరస్వతీదేవి జన్మదినం మాఘ మాసం శుక్ల పంచమి. శ్రీ సరస్వతీ దేవి బ్రహ్మ దేవేరి. తెల్లటి పద్మంపైన నిలుచుని, ఒక కాలు నిలువుగా, మరొక కాలు దానిపైన అడ్డంగా ఉంచుకుని తెల్లని దుస్తులు, పువ్వులు, తెల్లని పూసల కంఠహారం ధరించి వీణను, పుస్తకాలను చేతులలో ధరించి ఉంటుంది అని పద్మపురాణంలో వర్ణించారు.

మాఘ శుద్ధ పంచమినాడు ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని అర్చించి వివ్యారంభం చేయాలని శాస్త్ర వచనం. ఎందుకంటే, వసంత పంచమి నాడే క్షీరసాగర మథనంలో నుండి మహాలక్ష్మీ ఆవిర్భవించిన కారణంగా శ్రీపంచమి అని పిలుస్తారు. ఇక మహాగణపతిని, శ్రీలక్ష్మిని, సరస్వతీదేవిని షోడశోపచారాలతో పూజించాలి. శ్రీ సరస్వతీదేవి ప్రేతిమ కానీ, జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను పూజాపీఠంపై పెట్టుకుని పూజ చేయాలి. శ్రీ సరస్వతీదేవిని తెల్లని పువ్వులతో, సుగంధద్రవ్యాలతో, చందనంతో అర్చించి శుక్లవస్త్రాన్ని నివేదించాలి. తరువాత పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తే సరవ్వతీదేవి కరుణాకటాక్షాలవల్ల అపారమైన జ్ఞానం లభించి నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. బాసర తో పాటు పలు ప్రాంతాల్లో సరస్వతి టెంపుల్స్ లో వసంత పంచమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని చోట్లు ఈరోజు వసంత పంచమి వేడుకలు జరుపుతుండగా , మరికొన్ని చోట్ల శనివారం నిర్వహించనున్నారు. మొత్తానికి సరస్వతీ కటాక్షం కోసం పెద్దయెత్తున పూజలకు భక్తలు సమాయత్త మయ్యారు.

English summary

Vasantha Panchami celebrations was started at Goddess Gyana Saraswati temple at Basara, in Adilabad district. Many of the of devotees from many states are thronging the temple and offering worship to Godesses Saraswathi Devi.