గోమూత్రం పై పన్ను బాదుడు

VAT Tax On Gau Mutra in Andhra Pradesh

12:04 PM ON 13th May, 2016 By Mirchi Vilas

VAT Tax On Gau Mutra in Andhra Pradesh

కాదీది పన్ను కు అనర్హం అన్నచందంగా ఏపీ సర్కారు మరీ దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. విభజన కారణంగా నెలకొన్న ఆర్థిక లోటును భర్తీ చేసుకునేందుకు వీలున్న ఏ చిన్న అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేని బాబు సర్కారు ఇప్పటికే పెట్రోల్.. డీజిల్ మీద ప్రత్యేక పన్ను బాదుడు బాదేసింది. ఇంకా ఎన్నో రకాల పన్నుల వడ్డింపు సాగిస్తూ, ఇది చాలదన్నట్లు తాజాగా ఒక వస్తు వినియోగం మీద పన్ను విధిస్తూ తీసుకున్న నిర్ణయం విస్మయం కల్గిస్తోంది. ఆవు మూత్రానికి అయుర్వేదం.. మరికొన్ని అంశాల్లో ఉన్న ప్రాధాన్యత ఇస్తారు. గోమూత్రాన్ని పూజలకు.. ఔషధంగా పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ఇంత భారీగా వినియోగిస్తున్న గోమాత్రం మీద పన్ను వేస్తే నాలుగు రూపాయిలు వస్తాయని భావించిన, ఏపీ సర్కారు పన్ను మోత మోగిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా మరే రాష్ట్రంలోనూ ఇలాంటి పన్ను లేదని పలువురు పేర్కొంటూ, సర్కార్ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.

ఇవి కూడా చదవండి:భయం కాదు .. టెంప్ట్ చేస్తోన్న చెన్నై చంద్రం

గోమూత్రంపై పన్ను కారణంగా డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం 1940 కింద లైసెన్స్ పొంది అయుర్వేద.. హోమియోపతి మందుల్ని తయారు చేస్తున్న వారి మీద పన్నులు విధించినట్లే.. గోమాత్రాన్ని ఔషధంగా ఉపయోగిస్తున్నందుకు కూడా పన్ను కట్టాలని చెప్పటంపై విస్మయం వ్యక్తమవుతోంది. పలు వ్యాధులకు ఔషధంగా వినియోగించే ఆవు మూత్రం మీద పన్ను పోటు లేకుండా చేయాలని పలువురు కోరుతున్నారు. గోమూత్రాన్ని.. పేడను షాంపూలు.. సబ్బులు.. పెనాయిల్.. అగర్ బత్తీలు.. దూప్ బత్తీలు.. దోమల నివారణ కాయిల్స్ తదితర వస్తువల్ని ఉత్పత్తి చేసేందుకు వినియోగిస్తారు. ఇక మనుషులు తాగేందుకు వీలుగా గోమూత్రాన్ని శుద్ది చేసి అమ్ముతుంటారు. తాజాగా విధించిన పన్ను పోటు పుణ్యమాని గోమూత్రంతో తయారు చేసే వస్తు ధరలు పెరగటం ఖాయమంటున్నారు. ఈ పన్నుపై వస్తున్న విమర్శల నేపధ్యంలో సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:అవకాశం కోసం రెజీనా ఇంతగా దిగజారిందా?!

ఇవి కూడా చదవండి:ఫోటోషూట్ లో రెచ్చిపోయిన శృతి(వీడియో)

English summary

Government Of Andhra Pradesh was going to put VAT tax on Gau Mutra. Presently Gau Mutra was using in some of the Ayurvedic medicines and in Homeopathi Medicines.