25 కోట్లతో  సినిమా తీస్తే  140 కోట్లు వచ్చాయి

Vedalam total box office collection

04:50 PM ON 1st March, 2016 By Mirchi Vilas

Vedalam total box office collection

బడ్జెట్‌ ఎక్కువ పెట్టి తీస్తే లాభాలు వచ్చిపడిపోవు. అలా అని లాభాలు రావని కాదు. తక్కువ బడ్జెట్‌ లో తీసిన చాలా సినిమాలు బాక్స్‌ ఆఫీస్‌ వద్ద ఘనవిజయాలను సాధించాయి. బడ్జెట్‌ పెరిగింది అని అంటున్నారు కానీ ఇప్పటికీ కొన్ని సినిమాలు తక్కువ బడ్జెట్‌ తో తీసి సంచలన విజయాలు సృష్టించాయి. పెద్ద హీరోతో సినిమా అంటే 50 కోట్లు పెట్టాల్సిందే అని అందరూ అనుకుంటారు, కానీ పెద్ద హీరోలు కొంచెం ఆలోచించి రెమ్యూనరేషన్‌ని తగ్గించుకుని సినిమా బడ్జెట్‌ కూడా తగ్గించుకుంటే ఆ సినిమాకి కచ్చితంగా లాభాలు వచ్చి తీరుతాయి.

గత ఏడాది కోలీవుడ్‌లో ఓ సినిమా విషయంలో ఇదే విధంగా జరిగింది. తమిళంలో మంచి ఫేన్‌ ఫాలోయింగ్‌ ఉన్నహీరో అజిత్‌. ఇతడు నటించిన ‘వేదాలం’ చిత్రం మొత్తం బడ్జెట్‌ 25 కోట్ల లోపే అయ్యిందట. హీరో అజిత్‌ అలాగే చిత్ర దర్శకుడు శివ మూవీ బడ్జెట్‌ని తగ్గించడానికి వారు రెమ్యూనరేషన్‌ తీసుకోకుండా సినిమాకి వచ్చిన లాభాల్లో షేర్‌ తీసుకోవడానికి కమిట్‌ అయ్యారు. వీరు అనుకున్న విధంగానే ఈ వేదాలం చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలు సృష్టించింది. 25 కోట్లు పెట్టుబడి కి 140 కోట్ల గ్రాస్‌ని కలెక్ట్‌ చేసింది. బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. మొత్తం 74 కోట్లకు పైగా షేర్‌వచ్చిన ఈ చిత్రం అజిత్‌ కెరీర్‌ లోనే పెద్ద హిట్‌ గా నిలిచింది.

1/6 Pages

దర్శకుడు

వేదాలం చిత్ర దర్శకుడు శివ. సినిమా బడ్జెట్ ను తగ్గించడానికి తన రెమ్యునరేషన్ ను తీసుకోలేదు. సినిమాకు వచ్చిన లాభాల్లో షేర్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు శివ.

English summary

Vedalam film, released for Diwali 2015, broke several records and has now ended its run with a lifetime collection of Rs 140 crore .