రజనీని కూడా వీరప్పన్ కిడ్నాప్ చేయాలనుకున్నాడా ?

Veerappan Tried To Kidnap Rajinikanth

10:52 AM ON 18th May, 2016 By Mirchi Vilas

Veerappan Tried To Kidnap Rajinikanth

వివాదాస్పద వ్యాఖ్యల తో వార్తలకు ఎక్కడమే కాదు ..... సంచలన విషయాల్ని బహిర్గతం చేయడంలో తనకు తానే సాటి అన్పించుకున్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చాడు . గంధం చెక్కల స్మగ్లర్.. తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాల్ని వణికించిన వీరప్పన్ మీద సినిమా తీసిన వర్మ .... ఈ సినిమా కోసం చాలానే రీసెర్చ్ చేశాడట. ఈ సందర్భంగా వీరప్పన్ కు సన్నిహితంగా ఉన్న వారెందరినో కలిసిన వర్మ.. వారి నుంచి ఆసక్తికర అంశాల్ని తెలుసుకున్నాడట.

ఇవి కూడా చదవండి:లిప్ కిస్ తో కాజల్ ను షాక్ చేసిన హీరో

అలా తెలుసుకున్న వాటిలో కొన్ని తాజాగా వర్మ బయటపెట్టాడు. తనను తాను గొప్పగా భావించే వీరప్పన్.. ఒక దశలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను కూడా కిడ్నాప్ చేయాలని భావించాడట. అంతేకాదు.. రజనీకాంత్ కంటే తాను గొప్పవాడిగా ఫీల్ అయ్యేవాడన్న విషయాన్ని వర్మ వెల్లడించాడు.

ఒక కిడ్నాప్ ఉదంతంలో తనకు డబ్బులు ఇవ్వటానికి బదులుగా.. తన మీదనే ఒక సినిమా తీయాలని డిమాండ్ చేసి విషయాన్ని వెల్లడించిన వర్మ మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తాజాగా వీరప్పన్ మీద కొత్త సినిమా బాలీవుడ్ హీరో సచిన్ జోషి నిర్మిస్తున్న నేపధ్యంలో ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. ఇంతవరకూ సరే ఈ కొత్త చిత్రంలో ఇంకెన్ని సంచలన అంశాలు ఉంటాయో, మరిన్ని వివరాలను వర్మ వెల్లడిస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి:అల్లు అర్జున్ మొహం పై మళ్లీ కామెంట్ చేసిన అనసూయ

ఇవి కూడా చదవండి:మందు కొట్టాక అలా చేసారో ఇక అంతే!

English summary

Most Controversial Director Of Indian Cinema Ram Gopal Varma Says that Sandal Wood Smuggler Veerappan was planned to Kidnap Super Star Rajinikanth. He said that he met so many people for Veerappan movie and he kbnow this thing from them.