వర్మ ని ఛీటర్ అని తిట్టిపోసింది

Veerappan Wife Sensational Comments On Ram Gopal Varma

10:38 AM ON 4th July, 2016 By Mirchi Vilas

Veerappan Wife Sensational Comments On Ram Gopal Varma

నిత్యం ఎవరో ఒకరి మీద కామెంట్లు పెట్టి, వివాదం కానిదే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు పొద్దు పొడవదు. ఆవిధంగా ఎవరోకరి మీద వ్యాఖ్యానాలు, సెటైర్లు వేసి వార్తల్లో నిలిచే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కి దిమ్మ తిరిగే కౌంటర్ పడింది. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి రాంగోపాల్ వర్మ పచ్చిమోసగాడని ఆరోపించింది. కిల్లర్ వీరప్పన్ తమిళవర్షన్ విల్లాది విల్లన్ వీరప్పన్ రిలీజైన సందర్భంగా ఆమె మీడియా ముందుకొచ్చింది.

విల్లాది విల్లన్ వీరప్పన్ చిత్రాన్ని ఎవ్వరూ దయచేసి చూడొద్దని, ఆ కథ పూర్తిగా వీరప్పన్ జీవితానికి విరుద్ధమైనదని ఆమె అంటోంది. నా భర్త గురించి మీకు ఏమి తెలుసు.ఇష్టం వచ్చినట్టు కథలను అల్లుకుంటూ పోతున్నారు.నాలుగేళ్లు ఆయనతో అడవుల్లో జీవించా. ఆయన ఏమిటో నా ఒక్కదానికే తెలుసు. త్వరలో వాస్తవాలన్నీ బయట పెడతా. సినిమా రూపంలో తెర వెనుక జీవితం గుట్టు విప్పుతా అని వర్మను ముత్తులక్ష్మి తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. వీరప్పన్ జీవితం ఆధారంగా హిందీలో సినిమా తీసుకున్నట్టు తనతో రాంగోపాల్ వర్మ చెప్పారని, అందుకు తగ్గ సంతకం కూడా చేయించుకున్నారని ఇప్పుడు అనేక భాషల్లో రిలీజ్ చేస్తున్నారని ఆమె కారాలు మిరియాలు నూరుతోంది. పాపం ఈ మధ్య వర్మకు మహిళల నుంచి బానే కౌంటర్లు పడుతున్నాయ్.

ఇవి కూడా చదవండి:2016 సైమా విజేతలు వీరే..

ఇవి కూడా చదవండి:రెండో పెళ్లికి సిద్ధమైన మాజీ హీరోయిన్

English summary

Sandalwood Smuggler Veerappan wife Muttu Lakshmi made some controversial comments on Sensational Director Ram Gopal Varma by saying that Ram Gopal Varma movie on Veerappan was wrong and she said that she was only the person who know about Veerappan.