ఆ ఇద్దరు స్టార్ హీరోలు నన్ను ముంచేశారు!

Veeru Potla about Venkatesh and Raviteja

11:15 AM ON 14th October, 2016 By Mirchi Vilas

Veeru Potla about Venkatesh and Raviteja

సినిమా ఫీల్డ్ లో ఎవరు ఎప్పుడు ఎలా వుంటారో చెప్పడం కష్టం. బావుంటే వీరలెవెల్లో పొగిడేస్తూ లిఫ్ట్ ఇవ్వడానికి ముందుకొస్తారు. ఖర్మ కాలి ఓ సినిమా పోయిందా ఇక అంతే సంగతులు. ఇదంతా మళ్ళీ ఎందుకంటే, నాగార్జునతో రగడ చిత్రం చేసిన వీరూపొట్ల అందరికీ గుర్తున్నాడు కదా. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా సినిమా మాత్రం నలుగురి నోళ్లలో బాగానే నలగడంతో వీరూపోట్ల కూడా అందరికీ బాగా గుర్తున్నాడు. అయితే, టాలీవుడ్ కు చెందిన ఇద్దరు అగ్ర హీరోలు తనను నిలువునా ముంచారని వీరూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రగడ చిత్రం తరువాత వెంకటేశ్, రవితేజలతో ఒక మల్టీ స్టారర్ చిత్రానికి ప్లాన్ చేసానని, దానికి హీరోలు కూడా అంగీకరించారని చెప్పుకొచ్చాడు.

స్ర్కిప్టు మొత్తం పూర్తై షూటింగ్ ప్రారంభిద్దాం అనుకుంటుండగానే వెంకటేశ్, రవితేజలు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు చెప్పుకొచ్చాడు. దాంతో మరో కథ సిద్ధం చేసుకొని ఆ కథతో సునీల్ హీరోగా ఈడు గోల్డ్ ఎహే సినిమా చేసినట్లు చెప్పాడు. వెంకీ, రవితేజలు తనను మోసం చేశారని నేరుగా చెప్పకుండానే ఇద్దరు హీరోలు తనతో సినిమా చేస్తానని చెప్పి హ్యాండ్ ఇవ్వడంతో మునిగిపోయానని అనడం ద్వారా ఇన్నాళ్లూ మనసులో దాచుకున్న మాటను ఇలా బయటపెట్టేసాడు. మరి ఆ ఇద్దరు హీరోలు వెంకీ, రవితేజలేనా లేక మరో ఇద్దరు హీరోలా అనేది కూడా చెప్పేస్తే బాగుండేదేమో.

English summary

Veeru Potla about Venkatesh and Raviteja