బరువు తగ్గే చిట్కాలు ఇవిగో

Vegetarian Diet for weight loss

01:04 PM ON 25th November, 2015 By Mirchi Vilas

Vegetarian Diet for weight loss

శాఖాహారులు అయినా మాంసాహారులు అయినా శరీరానికి పోషక విలువలను తప్పకుండా అందించాలి. ఎక్కువ మోతాదులో తీసుకున్నా లేదా తక్కువ మోతాదులో తీసుకున్నా ప్రమాదమే. అందువల్ల శరీరానికి తగినంత మోతాదులో ప్రొటీన్స్‌, మినరల్స్‌ ఇతరత్రా అందేలా మనం జాగ్రత్తలు వహించాలి.

ఉదయం:

కింద తెలిపిన విధానాలలో ఏదో ఒక పద్దతిని అనుసరించడం మంచిది. రోజుని ఈ క్రింది విధంగా ప్రారంభించడానికి ప్రయత్నించండి.

  • వేడి నీళ్ళలో నిమ్మరసాన్ని కలిపి సేవించాలి ఈ జూస్‌లో జీరో కేలరీలు ఉంటాయి.
  • అలాగే వేడినీళ్ళలో నిమ్మరసం, తేనె కలిపి ఉదయాన్నే తాగాలి. ఇలా చేయడం వలన మన శరీరంలో ని కొవ్వును కరిగిస్తుంది.
  • అదేవిధంగా 1 కప్పు గ్రీన్‌టీ, బ్లాక్‌ టీ, బ్లాక్‌ కాఫీ ని పంచదార లేకుండా తీసుకోవాలి.

అల్పాహారం:

పై విధానాన్ని పాటించిన తరువాత అల్పాహారాన్ని తీసుకోవాలి. అది 350 కేలరీల కంటే తక్కువ ఉండేటట్లు చూసుకొవాలి.

  • రెండు చపాతీలు, ఒక కప్పుకూర ( లేదా ) రెండు ఇడ్లీలు, సగం కప్పు సాంబారు మరియు ఆఫ్‌ కప్పు తక్కువ కొవ్వు ( లో ఫ్యాట్ ) కలిగిన పాలు తీసుకోవాలి.

అల్పాహారం తరువాత బోజనానికి ముందు:

అల్పాహారం సేవించిన కొంచెం సమయం తరువాత ఉడక బెట్టిన పప్పుదినుసులు, సలాడ్‌లు మరియు తక్కువ కేలరీలు కలిగిన పళ్లు క్రింది విధంగా తీసుకోవాలి.

  • అర కప్పు పుచ్చకాయ ముక్కలు లేదా దోసకాయ ముక్కలు మరియు క్యారెట్‌ సలాడ్‌ ( లేదా )20 ద్రాక్ష పళ్ళు ( లేదా ) బాదం గింజలు తీసుకోవాలి.

కచ్చితంగా కేలరీలు 50-70 మధ్యలో ఉండేటట్లు చూసుకోవాలి.

మధ్యాహ్నభోజనం :

శాఖాహారులు వంటకాలను వివిధ పద్దతులలో రుచికరంగా చేస్తారు. అన్ని ఆకుకూరలు కూరగాయలను వంటకాలలో వాడుతారు.

తీసుకునే పద్దతి:

చపాతీలను కూరతో తీసుకోవాలి ( లేదా ) బ్రౌన్‌రైస్‌ ని కూరతో పాటు తీసుకోవాలి ( లేదా ) చపాతీ మరియు రైస్‌ తీసుకోవాలి. వీటిలో మీకు నచ్చిన పద్ధతిని అనుసరించండి. కాని 350 కేలరీలకు మించి మాత్రం తినకూడదు.

మరికొన్ని సలహాలు క్రింద తెలుపడం జరిగింది.

  • కప్పు బ్రౌన్‌ రైస్‌ ( 200 గ్రాములు మించకూడదు ) అర కప్పు కలగలుపు కూర ( మిక్సిడ్‌ వెజిటెబుల్స్ ), ఒక చిన్న కప్పు రైతా ( లేదా ) తక్కువ కొవ్వు కలిగిన పెరుగు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కూరలు చేసేటప్పుడు లో ఫ్యాట్‌ ( తక్కువ కొవ్వు ) కలిగిన నూనెతోనే వంటచేసుకోవాలి. అలాగే కొబ్బరిని వాడకూడదు.
  • 2 చపాతీలు అర కప్పు కూర మరియు ఒక కప్పు రైతా ( లేదా) గ్రీన్‌ సలాడ్‌ ని తీసుకోవాలి.
  • అర కప్పు రైస్‌ మరియు ఒక చపాతీని కూరతో తీసుకోవాలి ( లేదా ) చపాతీని మరియు రైస్‌ని రెండిటిని తీసుకోవచ్చు.

ఈ మూడు పద్ధతులలో ఏదో ఒక దాన్ని పాటించాలి. ఒక వేళ అప్పటికీ మీకు ఆకలి తీరలేదు అనుకుంటే బోజనానికి ముందు సూప్‌ని తాగవచ్చు.

సాయంత్రం:

వీటిలో మీకు నచ్చిన విధానాన్ని పాటించండి

  • గ్రీన్‌ టీ
  • బటర్ మిల్క్‌
  • ఉప్పుకలిపిన నిమ్మకాయ రసం.
  • ఉడకబెట్టిన ఓట్స్‌ అరకప్పుని పాలతో లేదా నీళ్ళతో తీసుకోవాలి.

ఒకవేళ ఇలా కాకుండా ఏమైనా తినాలి అనుకున్నారో అల్పాహారం సేవించిన అనంతరం తీసుకొన్న ఆహారం ఏదైతే ఉందో అదే పద్ధతిలో ఆహారాన్ని సేవించాలి.

రాత్రి బోజనం:

రాత్రి భోజనాన్ని ఏదైనా సూప్‌లో ప్రారంబించాలి.

2 చపాతీలు ( లేదా ) కొంచెం ఉప్మా ( లేదా ) 3 ముక్కలు బ్రౌన్‌ బ్రెడ్‌ ( లేదా ) 1 కప్పు ఓట్స్‌ని తీసుకోవాలి. వీటితో పాటు అర కప్పు ఉడికించిన కూరగాయలు మరియు 1 కప్పు సలాడ్‌ ని తీసుకోవాలి.

ఇలా రోజూ ఈ పద్ధతులను పాటించడం వలన కొద్ధి రోజులకి మీకే మార్పు తెలుస్తుంది. ఒక రోజు పాటించి తర్వాత మానేస్తే బరువు తగ్గడం ఒక కలలాగే మిగిలిపోయింది. ఏదైనా కష్టపడితేనే ఫలితం లభిస్తుంది. ఈ పద్ధతిని పాటించండి ఫలితాన్ని పొందండి.

English summary

Vegetarian Diet for weight loss. The calorie requirement of every person is different and some people prefer vegetarian food and some people prefer non vegetarian food.