మోడీని కాదు...  దేశ ప్రతిష్ట ను దిగజారుస్తున్నారు 

Venakayya Naidu Speech On Inrtolerance

12:42 PM ON 5th December, 2015 By Mirchi Vilas

Venakayya Naidu Speech On Inrtolerance

చీటికి మాటికీ ప్రధాని మోడీ ప్రతిష్టను దెబ్బతీసే రీతోలో విపక్షాలు వ్యవహరిస్తున్నాయని , వాస్తవానికి మోడీని దెబ్బతీసే చర్యల్లో దేశ ప్రతిష్టను దిగజార్చేలా విపక్షాలు వ్యవరిస్తున్నాయట, అసహనం పేరిట భారత్ కీర్తి ప్రతిష్టలను దెబ్బతీస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్య నాయడు అన్నారు. విజయవాడలో దుర్గ గుడి ఫ్లై ఓవర్ వంటన పనులకు బెంజి సర్కిల్ దగ్గర శనివారం శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు.

ఎంతోమంది భారత దేశం పై దండెత్తి వచ్చారే తప్ప, భారతీయులు ఎప్పుడూ ఏదేశం పైకి దండయాత్రకు వెళ్లలేదని ఆయన గుర్తు చేస్తూ , అలాంటి భారత్ ని సహనం లేని దేశంగా చిత్రించే చర్యలకు విపక్షాలు దిగుతున్నాయని ,ఆయన ఆరోపించారు. ప్రధాని మోడీ ని దేశ ప్రజలే కాదు, యావత్ ప్రపంచం కీర్తిస్తోందని , మోడీ వ్యక్తిత్వం , పాలన దక్షత గురించి అమెరికా అధ్యక్షుడు ఒబామా తో సహా అందరూ ప్రశంసిస్తూ వున్నారని ఆయన చెప్పారు. పెట్టుబడులకు కేంద్రంగా అందరూ భారత్ వైపు చూస్తున్నారని , అలాగే దేశంలో ఎపి వైపు చూస్తున్నారని ఆయన అన్నారు.

సువిశాల భారత్ లో ఎక్కడో ఏదో చిన్న చిన్న సంఘటనలు జరిగితే వాటిని , గోరంతలు కొండంతలుగా చేసి , చూపిస్తూ , ఇక్కడ ప్రజలు ఒకరినొకరు కొట్టుకుంటున్నట్లు , గొడవలు పడుతున్నట్లు చిత్రించడం ద్వారా పెట్టుబడులు రాకుండా చేయాలనీ చూస్తున్నారని వెంకయ్య విమర్శించారు. వేలాది మంది సిక్కులను ఊచకోత కొస్తే , పెద్ద వట వృక్షం కూలినపుడు ప్రమ్పణలు సహజమని చెప్పిన వాళ్ళు , ఎమర్జెన్సీ పేరిట పత్రికల నోళ్ళు నొక్కి , ప్రతిపక్షి నేతలను జైళ్ళలో పెట్టించిన వాళ్ళు ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ద్వజమెత్తారు.

English summary

Central minister talks about intolerance in india in Durga Gudi fly over inaguration cermony which was held on Vijayawada ,Andhra Pradesh. In that cermony central minister venkayya naidu talks about intolerance contreversy in india