వెనిజులా ప్రెసిడెంట్ ని తరిమి కొట్టేసారు ..

Venezuela People Chases Their President Maduro

11:12 AM ON 6th September, 2016 By Mirchi Vilas

Venezuela People Chases Their President Maduro

ఒకసారి ఎన్నికయ్యాక మనల్ని ఎవరూ ఏమీ చేయలేరనే భావన బలంగా ఉంటే అది వెంటనే తీసెయ్యమని ఈ ఘటన రుజువుచేస్తోంది. ప్రజలను పట్టించుకోకుంటే పాలకుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పేందుకు ఇదో చక్కని ఉదాహరణ. ఆకలితో అలమటించిపోతున్నా పట్టించుకోని పాలకులు ఉంటే ఎంత లేకుంటే ఎంత అని భావించిన ప్రజలు అధ్యక్షుడిని తరిమితరిమి కొట్టారు. వేలాదిమంది ప్రజలు వెంటపడి మరీ తరిమారు. ప్రజల ఆగ్రహానికి అధ్యక్షుడు తోకముడవక తప్పలేదు. ప్రజల ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి సాక్షాత్తూ, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాడ్యురో.

అప్పటి వెనిజులా అధ్యక్షుడు హ్యుగో చావెజ్ మృతి చెందాక 2013లో జరిగిన ఎన్నికల్లో నికోలస్ మాడ్యురో గెలిపొందారు. అయితే రోజురోజుకు ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతుండడంతో ఆయన ప్రజలను పట్టించుకోవడం పూర్తిగా మానేశాడు. దీంతో ప్రజలు గత కొంతకాలంగా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆకలిదప్పులతో ప్రజలు అలమటించిపోతున్నా, పట్టించుకోవడం లేదని కోపంతో రగిలిపోతున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం ఆయన కారకస్ లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదే అదునుగా భావించిన ప్రజలు వేలాదిమంది ప్రజలు గిన్నెలు, కుండలు చేతబట్టి రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. అంతటితో ఆగలేదు, ఏకంగా అధ్యక్షుడిపైకి దూసుకెళ్లారు. అతడిని వెంబడించారు. ప్రజల ఆగ్రహానికి పసిగట్టిన ఆయన అక్కడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ప్రజలను శాంతింపజేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

అధ్యక్షుడిని పట్టుకునేందుకు ప్రజలు పరుగులు పెట్టారు. అతడిని వెంబడించారు. ప్రజలను పట్టించుకోని మాడ్యురో తక్షణం గద్దె దిగాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా వెనిజులాలో ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో ఉండడంతో అక్కడి ప్రజల పరిస్థితి దయనీంగా మారింది. ఆకలికి తట్టుకోలేని ప్రజలు ఇటీవల ఓ జూపై దాడిచేసి గుర్రాన్ని చంపేసి తిన్నారంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు తిరగబడే వరకూ పాలకులు తమ పరిస్థితి తెచ్చుకోవద్దని ఈ ఘటన చాటి చెబుతోంది.

ఇవి కూడా చదవండి:అగ్ర రాజ్య నేతకు షాకిచ్చిన చైనా

ఇవి కూడా చదవండి:రూపాయికే 1జిబి... రిలయన్స్ జియోకి జర్క్ ఇచ్చిన బీఎస్ ఎన్ ఎల్.

English summary

Venezuela people fires on their elected president and tried to attack him. Recently drought have been increased in Venezuela and so many people was suffering from severe hunger due to lack of food. But the president was not mind about people and that's the reason to people tried to attack on Venezuela president Maduro.