ప్రధాని దృష్టికి వర్ష బీభత్సం : వెంకయ్య

Venkaiah Naidu Conversation With PM About Floods

12:22 PM ON 18th November, 2015 By Mirchi Vilas

Venkaiah Naidu Conversation With PM About Floods

ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులలో తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల ఏర్పడిన నష్టం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తెలియచేసినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నుంచి తగిన సాయం అందుతుందన్నారు. నెల్లూరు జాతీయ రహదారి పునరుర్ధరణకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ చర్యలు చేపడుతున్నట్లు ఆయన సూచించారు. బాధితులకు సహాయం అందించడం, దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలు చేపట్టడంపైనే అందరూ దృష్టీ సారించాలని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ రహదారి కొట్టుకుపోవడంతో ప్రజా రవాణా స్తంభించి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

English summary

Venkaiah Naidu Conversation With PM About Floods