ఇక పూలకు రాం రాం... అంటున్న వెంకయ్య

Venkaiah Naidu refuse to take flower bouquets

11:56 AM ON 18th July, 2016 By Mirchi Vilas

Venkaiah Naidu refuse to take flower bouquets

అది చిన్న కార్యక్రమమైనా, పెద్దదైనా సరే, అక్కడికి రాజకీయ నాయకుడ్ని ఆహ్వానిస్తే పూలమాలలు వేయడం, చేతికి పూల బొకే ఇవ్వడం కామన్. అలాంటిది కేంద్రమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏదైనా కార్యక్రమానికి హాజరైతే ఆ హడావుడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టన్నుల కొద్దీ దండలు, గుట్టలుగా పూల బొకేలు అక్కడ దర్శనమిస్తాయి. అయితే, ఇలాంటి మర్యాదలకు చెక్ పెట్టేలా కేంద్ర సమాచార శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు తాజాగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇకపై తాను పాల్గొనే కార్యక్రమంలో పూలమాలలు తీసుకురావద్దని.. తనకు పూల మాలలు వేయొద్దని కోరారు.

ఇకపై ఎవరూ తనకు పూల మాలలు వేయొద్దని ఆయన సూచించారు. ఒకవేళ ఎవరైనా తీసుకొచ్చినా వాటిని తాను తీసుకోనని కూడా స్పష్టం చేసేశారు. ఒకవేళ.. అభిమానం ఉంటే ఖాదీ చేనేత కండువా ఇస్తే తీసుకుంటానని చెప్పారు. మరి.. వెంకయ్య మాటను ఎంతమంది అమలు చేస్తారన్నది ఆసక్తికరమైన అంశం. హడావుడి కోసం పూలమాలలు తీసుకొచ్చే కన్నా.. కండువాలాంటిది ఇవ్వటమే మంచిదని చెప్పాలి. మొత్తానికి మాంచి నిర్ణయమే తీసుకున్నారని, అయితే ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణమేమిటని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.

English summary

Venkaiah Naidu refuse to take flower bouquets