మళ్ళీ నయనతారతోనా..

venkatesh and maruthi movie starting on december 16

05:13 PM ON 25th November, 2015 By Mirchi Vilas

venkatesh and maruthi movie starting on december 16

'భలేభలే మగాడివోయ్‌' చిత్రంతో మంచి హిట్‌ అందుకున్న దర్శకుడు మారుతి. దృశ్యం, గోపాలగోపాల చిత్రాలతో వరుస హిట్స్‌ అందుకున్న హీరో వెంకటేష్‌. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తాజాగా ఒక సినిమా తెరకెక్కబోతుందన్న విషయం తెలిసిందే. అయితే సినిమా ఘాటింగ్‌ ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయం తెలియలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని డిసెండర్‌ 16న పూజాకార్యక్రమాలు జరిపి అదే రోజు రెగ్యులర్‌ ఘాటింగ్‌ మొదలు పెడతారు. లక్ష్మీ, తులసి చిత్రాల్లో వెంకటేష్‌ కి జోడీగా నటించిన నయనతార ఈ చిత్రంతో మూడోసారి వెంకటేష్‌కి జత కట్టబోతుంది.

ఈ చిత్రాన్ని ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) సమర్పిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో ప్రొడక్షన్‌ నెం.2 అనే పేరుతో సూర్యదేవర నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కమల్‌హాసన్‌ చిత్రాలైన ఉత్తమవిలన్‌, పాపనాశనం, చీకటిరాజ్యం, తెలుగులో రన్‌రాజారన్‌, జిల్ వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించిన జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

English summary

venkatesh new movie shooting starting on december 16 which was directing by maruthi. Venkatesh pairing once again with nayanathara.