ఈ సంవత్సరంలోనే వెంకీ మూడు సినిమాలు

Venkatesh release 3 movies in this year

03:58 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

Venkatesh release 3 movies in this year

విక్టరీ వెంకటేష్‌ గత సంవత్సరంలో 'గోపాల గోపాల' తప్ప మరే సినిమానూ రిలీజ్‌ చేయలేదు. తన కెరీర్‌ లో ఇంతకు ముందెప్పుడూ అంత గ్యాప్‌ తీసుకోలేదు. అయితే ఈ సంవత్సరంలో వెంకీ మూడు సినిమాలు రిలీజ్‌ చేయడానికి సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో వస్తున్న 'బంగారుబాబు' సినిమాలో వెంకీ నటిస్తున్నాడు. ఈ సినిమాలో వెంకీ సరసన నయనతార నటిస్తోంది. వేసవిలో రిలీజ్‌ అవ్వనున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. బంగారుబాబు సినిమా రిలీజ్‌ అవ్వడానికి ముందే వెంకీ ఇంకో సినిమా మొదలుపెట్టనున్నాడు. ఆ సినిమా కి శివకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఆ సినిమా నల్లమలపుబజ్జి నిర్మాణంలో తెరకెక్కనుంది. వచ్చేనెల చివరిలో ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్టు సచామారం. ఈ రెండు సినిమాలతో పాటు మరొక సినిమా కూడా వెంకీ ఈ సంవత్సరంలోనే మొదలు పెడతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మూడు సినిమాలు ఈ సంవత్సరం లోనే రిలీజ్‌ చెయ్యడానికి వెంకీ ప్లాన్‌ చేస్తున్నాడు.

English summary

Venkatesh want to release 3 movies in this year. Now he is acting in Maruti direction that was Bangaru Babu movie. After that he want to act another 2movies.