వయస్సు గురించి వెంకీ షాకింగ్ కామెంట్స్

Venkatesh Shocking Comments

11:28 AM ON 10th August, 2016 By Mirchi Vilas

Venkatesh Shocking Comments

ఆడాళ్ళ వయస్సు , మగాళ్ల జీతం అడగకూడదని అంటారు. కానీ విక్టరీ వెంకటేష్ మరోసారి వయసు గురించి మనసు విప్పి మాట్లాడేసాడు. దాచుకుంటే దాగేది కాదంటూ తన వయసుని ఓపెన్గా ఒప్పేసుకున్నాడు. ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకీ తాను వెటరన్నేనని చెప్పకనే చెప్పేశాడు. బాబుబంగారం మూవీ ఆడియో ఫంక్షన్లో కూడా సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలే చేసినప్పటికీ, డైరెక్టర్ మారుతి తన వయసుని తగ్గించేశాడని మరో పదేళ్లు లైఫ్ ఇచ్చాడని కవరింగ్ ఇచ్చుకోవాల్సివచ్చింది.

ఇక ‘బాబు బంగారం’ మూవీ ప్రమోషన్లో భాగంగా ‘ది హిందూ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం తనకి ఏజ్ బారైపోయిందంటూ కుండబద్దలు కొట్టేశాడు. నిజానికి చిన్నాపెద్దా గ్యాప్లతోనైనా వెండితెరకు టచ్లోనే వుంటున్న విక్టరీ వెంకటేష్, అసలు వయసు ఐతే, బాబు బంగారం గానీ దానికి ముందు వచ్చిన మూడునాలుగు సినిమాల్లోగానీ వెంకీ గెటప్నీ, వెంకీ ఫిజిక్నీ గమనిస్తే.. తాను ఫిఫ్టీ ప్లస్ అనిపించే ఛాన్సే లేదు.

తన తర్వాత సినిమాలో బాక్సింగ్ కోచ్గా కనిపించనున్న వెంకటేష్, ఆ రోల్కి తగ్గట్టుగా స్పెషల్ డైట్లో వున్నట్లు చెప్పుకున్నాడు. కుర్ర డైరెక్టర్లు కో-ఆపరేట్ చేయాలేగానీ ఈ లెక్కన వెంకీ మరో పదేళ్లపాటు లైమ్ లైట్లో కచ్చితంగా వుంటాడని సినీ లవర్స్ కామెట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: దెయ్యాలను గుర్తించడం ఎలా ?

ఇది కూడా చూడండి: ఈ దేశాలలో మన రూపాయి విలువ చాలా ఎక్కువ

ఇది కూడా చూడండి: శ్రీశైలం లో బయట పడ్డ రహస్యాలు

English summary

Venkatesh Shocking Comments on his age.