పవన్ కి కౌంటర్ ఎటాక్ ఇచ్చిన వెంకయ్య(వీడియో)

Venkayya Naidu counter attack to Pawan Kalyan

07:09 PM ON 10th September, 2016 By Mirchi Vilas

Venkayya Naidu counter attack to Pawan Kalyan

ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న కాకినాడలో నిర్వహించిన ఈ సభలో కేంద్ర మంత్రి వెంకయ్యపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇందుకు స్పందించిన వెంకయ్యనాయుడు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం న్యూ ఢిల్లీలో వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కొందరు నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.. వారందరికి నేను సమాధానం చెప్పను. చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారందరికీ ఈ విషయం తెలుసు అని వ్యాఖ్యానించారు. నేను ప్రజలకే జవాబుదారిని... ప్రజలకే సమాధానం చెబుతానంటూ పవన్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు.

నాకు ఎవరి సర్టిఫికెట్లు అవసరం లేదన్నారు.. విమర్శలు చేస్తున్న వారికి భయపడి వెనక్కి వెళ్లనని వెంకయ్య ధీమాగా చెప్పారు. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించకపోయినా ఏపీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నానని వెంకయ్య చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్న వారు అప్పుడు ఎక్కడ ఉన్నారని వెంకయ్య ప్రశ్నించారు.? ప్రత్యేకహోదా గురించి పార్లమెంట్ లో మాట్లాడింది నేనే అని మరోసారి వెంకయ్య చెప్పారు. ఏపీకి హోదాకు మించిన సాయాన్ని అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: కన్నీరు పెట్టుకున్న బాబు.. భాగ్యనగరంలో చివరి సెషన్

ఇది కూడా చదవండి: షాక్: విమానంలో ఎవరూ చేయని పని చేసింది(వీడియో)

ఇది కూడా చదవండి: 2.5 కోట్లతో భారీ సెట్.. అదరహో అనిపించిన పెళ్లి(వీడియో)

English summary

Venkayya Naidu counter attack to Pawan Kalyan