నవరసాల తోట నరసరావు పేట అంటున్న వెంకయ్య 

Venkayya Naidu Talks About Narasaraopeta

12:02 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Venkayya Naidu Talks About Narasaraopeta

'ఉద్యమాలకు ఊపిరి , పౌరుషాల కు ప్రతీక నరసరావు పేట నిలించింది. రాజకీయాలకు కంచుకోట ఇది. నవరసాల తోట మన నరసరావు పేట' అన్నారు కేంద్రమంత్రి ఎం వెంకయ్యనాయడు. కన్నతల్లి , జన్మభూమి , దేశాన్ని మరచిన వాడు మనిషే కాదు ఆన్నారు ఆయన. గుంటూరు జిల్లా నరసరావుపేట పురపాలక సంఘం నూరు వసంతాలు పూర్తిచేసుకున్న శుభ సందర్భంగా మూడు రోజులపాటు నిర్వహించ తలపెట్టిన శతాబ్ది వేడుకులు శనివారం రెండవరోజుకు చేరాయి. నరసరావుపేట మున్సిపాల్టి శతాబ్ది ఉత్సవాలకోసం ఎపి శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు సారధ్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

భూగర్భ డ్రైనేజి , పక్కా గృహాలు , టౌన్ హాలు దగ్గర ఆర్ యూబీ పార్కులకు వెంకయ్య శంకుస్థాపన చేసారు. గుంటూరు జిల్ల్లాకు గుంటూరు రాజధాని అయినా శాసించేది నరసరాపేట అని ఆయన అన్నారు. దాదాపు 25ఓ కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయమన్నారు. అనేక వర్గాల కోసం స్మశాన వాటికలు ఆధునీకరించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేసారు. ప్రగతి పథంలో దూసుకెళుతున్న నరసరావు పేట ఈ శతాబ్ది ఉత్సవాల ద్వారా స్ఫూర్తి పొందాలన్నారు. పలువురు మంత్రులు , అధికారులు , అనధికారులు , ప్రముఖులు , ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

English summary

Central minister Venkayya Naidu says that Narasaraopeta is famous for its culture, nature and politics. Venkayya Naidu says this is Narasaraopeta municipal cenetary 100 years celebration event