అమిత్ షాను ఆంబోతుతో పోల్చిన ఆచారి!

Venugopala Chary fires on Amit Shah

05:59 PM ON 21st September, 2016 By Mirchi Vilas

Venugopala Chary fires on Amit Shah

రాజకీయాల్లో వెరైటీగా ఉంటాయి. తాము మాత్రం ఎవరినైనా అనేయవచ్చు కానీ తమను ఎవరూ పల్లెత్తు మాట అనకూడదని తెగ ఫీలైపోతుంటారు. అందునా తెలంగాణ అధికారపక్ష నేతలు అయితే ఇక చెప్పక్కర్లేదు. వాళ్ళు ప్రత్యర్థులపై ఎంత దూకుడుగా ఉంటారో చాలాసార్లు చూసాం. ఒకవేళ రాజకీయ వైరుధ్యంతో ఎవరైనా ఘాటుగా విమర్శిస్తే, అందుకే రియాక్షన్ ఎంత తీవ్రంగా ఉంటుందో తాజాగా మరోసారి నిరూపించారు. తమ అధినేత కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేసిన బీజేపీ చీఫ్ పై ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు ఒంటికాలిపై లేచారు. ఇక టీఆర్ఎస్ నేత వేణుగోపాలాచారి మరోఅడుగు ముందుకేసి తమ సిద్ధాంతాల్ని తెలంగాణ మీద రుద్దే ప్రయత్నం చేస్తూ.. అల్లకల్లోలం చేయటానికి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

లౌకికవాదంతో ఉన్న టీఆర్ఎస్ కు ఓవైసీతో జత చేసి నిందించవద్దన్నారు. కేసీఆర్ ను విమర్శించే హక్కు.. స్థాయి అమిత్ షాకు లేదన్న ఆయన.. తెలంగాణకు ఢిల్లీలోని బీజేపీ సర్కారు చేసిందేమీ లేదన్నారు. బీజేపీ చీఫ్ రాజకీయ అజ్ఞాని అని విమర్శిం చారు. అంతటితో వదల్లేదు, అచ్చోసిన అంబోతులా మాట్లాడుతున్నారంటూ పే..ద్ద మాటనే వదిలారు. కేంద్రంలో కొలువు తీరిన జాతీయ పార్టీ అధ్యక్షుడ్ని ఒక రాష్ట్ర అధికారపక్షానికి చెందిన నేత ఒకరు తీవ్రస్థాయిలో మండిపడటం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది. ఇక కమల దళాధిపతులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఇది కూడా చదవండి: భారతీరాజాను దొంగ అనేసిన రాధిక..

ఇది కూడా చదవండి: రాధికా ఆప్టేని ఒక నైట్ కి రమ్మన్న స్టార్ హీరో ఎవరు?

ఇది కూడా చదవండి: అనుమానంతో భార్యను చంపేసి.. ఆ తరువాత ఏం చేసాడో తెలిస్తే షాకౌతారు!

English summary

Venugopala Chary fires on Amit Shah. Venugopala Chary called Amit Shah that he was bull and buffalo.