పిల్లలను పేడలో పడేయడం ఆచారమా..

Verity traditional party

06:51 PM ON 17th November, 2015 By Mirchi Vilas

Verity traditional party

మీరు సరిగానే చదివారు. పేడ లో పడేయడమే ఆచారమంట ఇదేం వింత అని అడిగితే మా ఆచారం ఇంతే అంటున్నారు. కొరడాలతో కొట్టుకోవడం, నాలిక మీద సూదులు గుచ్చుకోవడం, రక్తం కారేలా తలలు బాదుకోవడం, నిప్పులమీద నడవడం ఇలా చాలా వింటుంటాం. అందులో ఒక వింత ఆచారం పిల్లలను పేడలో పడేయడం.

స్వయంగా పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులే పేడలో పడుకోబెడుతున్నారు. ఈ తతంగం అంతా మధ్యప్రదేశ్‌లో బేతల్‌ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కార్తీక మాసం మొదలైన మొదటి రోజుల్లో గోవర్ధనపూజ చేస్తారు. ఇది ఉత్తరాది ఆచారం. ఈ పూజ తర్వాత ఊరివారంతా ఎక్కడెక్కడినుండో ఆవు పేడలను తీసుకొచ్చి వీదిలో ఒక కుప్పగా వేస్తారు. ఆ ఆవు పేడకు భక్తి శ్రద్దలతో పూజచేసి తర్వాత తమ పిల్లలను బలవంతంగా ఎత్తుకొచ్చి అందులో పడుకోబెడతారు. మేము రామన్నా వదిలే ప్రసక్తే లేదు. ఇలా చేస్తే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది ఎలాంటి రోగాలు రావు అని మరింత బలవంతులు అవుతారని వారి వాదన. ఇది వారి గుడ్డి నమ్మకం. ఇదేం విడ్డూరం అని ఎవరైనా అడిగితే ఇదే మా ఆచారం అని చెప్పుకొస్తున్నారు అక్కడి ప్రజలు.

English summary

Verity traditional party