వెరిజోన్ చేతికి యాహూ ...

Verizon To Purchase Yahoo For Huge Ammount

12:14 PM ON 26th July, 2016 By Mirchi Vilas

Verizon To Purchase Yahoo For Huge Ammount

ఇప్పుడు ఓ కంపెనీని మరో కంపెనీ కొనేసి, తనలో కలిపేసుకుని విధానం జోరుగా నడుస్తోంది. ఈక్రమంలో భాగంగా ఇంటర్నెట్ దిగ్గజ సంస్థ యాహూను వెరిజోన్ కమ్యూనికేషన్స్ కొనుగోలు చేయడానికి అంగీకరించింది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. మొత్తం ఈ ఒప్పందం విలువ 4.83 బిలియన్ డాలర్లు గా చెబుతున్నారు. దీంతో గత కొంత కాలం నుంచి ప్రాభవాన్ని కోల్పోయిన యాహూకు ఇబ్బంది తొలగినట్లేనని అంటున్నారు.
యాహూ ఇంటర్నెట్ ఆపరేషన్స్ ను కొనుగోలు చేయడంతో వెరిజోన్స్ ఇంటర్నెట్ ఆపరేషన్స్ మరింత పుంజుకోనున్నాయని అంటున్నారు. కాగా గతేడాది యాహూ అడ్వర్టైజింగ్ టెక్నాలజీ టూల్స్ ను 4.4 బిలియన్ డాలర్లు చెల్లించి మరీ వెరిజోన్స్ కొనుగోలు చేసింది. దీనిపై యాహూ సీఈవో మరిస్సా మయార్ మాట్లాడుతూ నేడు యాహూకు కీలకమైన రోజు. వ్యక్తిగతంగా నాకు కూడా. ఐలవ్ యాహు’ అని ప్రకటించారు. దాదాపు 20 ఏళ్లపాటు ఇంటర్నెట్ ప్రపంచంలో రారాజులా వెలిగిన యాహూ కు ఇప్పుడు కొంత ఇబ్బంది ఏర్పడింది. ఫలితంగా దీని విలువ కూడా గణనీయంగా పడిపోయింది. నిజానికి ఈ డీల్ యాహుకు పెద్దగా కలిసిరానట్లే లెక్క. డాట్ కామ్ సంక్షోభానికి ముందు 2000లో యాహూ విలువ దాదాపు 100 బిలియన్ డాలర్లు. 2008లో కూడా మైక్రోసాఫ్ట్ 44 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినప్పటికీ, ఆ ఆఫర్ ను యాహూ కాదనుకుంది.

1/10 Pages

ఫిబ్రవరిలో యాహూ ఇంటర్నెట్ వ్యాపారంలో వ్యూహాత్మక ప్రత్యామ్నాయాల కోసం గాలింపు చేపట్టింది. కొన్నేళ్లుగా యాహూ ఇంటర్నెట్ వ్యాపార ప్రకటనల్లో వస్తున్న మార్పులను అనుకూలంగా మలుచుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

English summary

Verizon company announced that they were going to buy popular Mail Service and Search Engine company Yahoo for a huge deal of 4.8 Billion Dollars.