ఆ కేసులో ఇరికించారు - ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా ..

Veteran Actress Yamuna Says That She was not a prostitute

11:08 AM ON 20th August, 2016 By Mirchi Vilas

Veteran Actress Yamuna Says That She was not a prostitute

సినిమాలూ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి యమన - 2011లో అనూహ్యంలో ఒక వ్యభిచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంది. బెంగళూరులోని ఒక స్టార్ హోటల్లో వ్యవభిచారం చేస్తూ దొరికిపోయినట్లు వార్తలు రావడంతో అప్పట్లో సంచలనమైంది. ఆ ఘటన తరువాత యమున మీడియా ముందుకు పెద్దగా వచ్చింది లేదు. ఎప్పుడు ఎవరు కనిపించినా ఆ ఘటన గురించే అడుగుతూ మనస్తాపానికి గురి చేస్తున్నారని యమున చెప్పేమాట.

ఈ నేపహ్ద్యంలోనే తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే ఘటన గురించి యమన కొంచెం ఘాటుగా స్పందించింది. బెంగళూరులోని ఐటీసీ హోటల్లో తాను వ్యవభిచారం కేసులో బుక్ అయినట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదని యమున అంటోంది. నిజానికి తాను ఆరోజు ఆ హోటల్ కి వెళ్లలేదనీ - సీసీపీ ఆఫీస్ కి వేరే పనిమీద వెళ్లానని యమున చెప్పారు. అయితే ఆ ఘటన తరువాత తాను తలెత్తుకుని తిరగలేకపోయానన్నారు. ఆ విషయం చాలా బాధకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నానని అలా చేస్తేనే తన పిల్లలపై ఎలాంటి మచ్చ లేకుండా ఉంటుందని భావించినట్టు వివరించింది.

అయితే తాను మరణించాక పిల్లల పరిస్థితి తల్చుకుంటే వారి భవిష్యత్తు ఏమైపోతుందో - ఎటువైపు సాగుతుందో అనే భయం వేసిందని దాంతో ఆ ఆలోచనను విరమించుకున్నానని యమున చెప్పుకొచ్చింది. నిజానికి ఆ రూమర్స్ వినిపిస్తున్న రోజుల్లో బతకాలన్న ఆశ చనిపోయిందనీ కేవలం పిల్లల కోసమే గుండె నిబ్బరం పెంచుకుని బతుకుతున్నానని యమున బాధపడుతున్నారు. ఆ ఘటనకు సంబంధించిన నిజానిజాలు ఏంటో ఏదో ఒక రోజులు ప్రజలందరికీ తప్పకుండా తెలుస్తాయన్న నమ్మకం తనకి ఉందన్నారు. ఆ ఒక్క ఘటన తన వ్యక్తిగత జీవితంపైనా కెరీర్ పైనా చాలా ప్రభావం చూపిందని ఇప్పుడు బాధపడుతోంది. ఇన్నాళ్లకు మీడియా ముందు తన ఆవేదనను తెలపడంపై సినీ లవర్స్ మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.

English summary

Veteran Actress Yamuna acted in Many of the telugu films and serials and suddenly she caught in prostitute in Banglore and recently she gave an interview and said some interesting facts that happend in her life.