ప్రపంచం చూపిస్తాడని వెళ్ళా .. తీరా ఇలా అయింది

Veteran Bollywood Actress Mamata Kulakarni Interview

11:17 AM ON 29th July, 2016 By Mirchi Vilas

Veteran Bollywood Actress Mamata Kulakarni Interview

బాలీవుడ్ లో 1992 నుంచి 2002 వరకూ టాప్ 2 హీరోయిన్ గా ఓ ఊపు ఊపిన మమతా, కెరీర్ మంచి ఊపుమీదున్న టైంలోనే డ్రగ్స్ మాఫియా నేరగాడు విక్కి గోస్వామితో లవ్ లో పడి దుబాయ్ వెళ్లిపోయింది.

ఆమె ఖాతాలో కరణ్ అర్జున్, ఆషికీ అవారా వంటి సక్సె్స్ ఫుల్ మూవీస్ ఉన్నాయి. ముంబైలో ఇటీవల వెలుగుచూసిన ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ లో నిందితురాలిగా వార్తల్లోకెక్కింది. డ్రగ్స్ రాకెట్ నిందితుడు విక్కీ గోస్వామితో సహజీవనం చేస్తుందని అంతా భావిస్తున్న మమతా కులకుర్ణి, రీసెంట్ గా ఇంటర్వ్యూ ఇచ్చింది. తన ఆత్మకథను చదివితేనే, ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అంగీకరించిన, ఈమె ఎన్నో విషయాలు వెల్లడించింది.

ప్రపంచం చూపిస్తానన్నాడని వెళ్లిన తాను ఇప్పుడు నైరోబీ దేశంలో ఒంటరిగా ఓ అపార్ట్ మెంట్ లో యోగా, ధ్యానం ద్వారా పూర్తిగా ఆధ్యాత్మికంలో గడుపుతున్నానని మమతా కులకర్ణి అంటోంది.

హీరోయిన్ గా మంచి క్రేజ్ లో ఉన్నప్పుడే తనకు ఈ రంగం సరిపడదని అర్థమయిందంది. విక్కీ తన స్నేహితుడని, అతడు ప్రపంచం చూపిస్తానని తనను తీసుకెళ్లాడని, ప్రస్తుతం తాను ఒంటరిగా నైరోబీలోని ఓ అపార్ట్ మెంటులో ఉంటూ యోగా, ధ్యానం ద్వారా పూర్తిగా ఆధ్యాత్మిక దీక్షలో గడుపుతున్నానని మమత చెప్పింది.

ముంబై డ్రగ్స్ రాకెట్ కేసులో తన ప్రమేయం ఏమాత్రం లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను ఆధ్యాత్మికత వైపు మళ్లానని, కాపాలిలోని శ్రీ గగన్ గిరి మహారాజ్ గురువు దగ్గర ఆథ్మాత్మిక దీక్ష తీసుకొని యోగినిగా మారినట్టు మమతాకులకర్ణి వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:నన్ను వెలి వేశారు - వెళ్తే చంపేస్తారు కూడా ...

ఇవి కూడా చదవండి:నువ్వా-నేనా అంటున్న ప్రకాష్ రాజ్-రావు రమేష్

English summary

Bollywood Veteran Top Heroine Mamata Kulakarni was become popular in Bollywood with some Super Hit movies and she suddenly said good bye to her career because she fell in deep love with Drugs Mafia member Vickey Goswami. She says that atpresent she was doing yoga in an Apartment in Nirobi.