సీపీఐ సీనియర్ నేత బర్దన్‌ ఇకలేరు

Veteran CPI Leader Bardhan passes away

11:13 AM ON 4th January, 2016 By Mirchi Vilas

Veteran CPI Leader Bardhan passes away

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) సీనియర్ నాయకుడు ఏబీ బర్దన్‌(92) శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బర్దన్‌ దిల్లీలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో డిసెంబర్‌ 7 నుంచి ఆయన దిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. శనివారం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. బర్దన్‌ సెప్టెంబర్‌ 24, 1924 బంగ్లాదేశ్‌లోని సిల్‌హెట్‌లో జన్మించారు. 1940 మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ విశ్వవిద్యాలయంలో చేరిన బర్దన్‌ ఆల్‌ఇండియా స్టూడెంట్‌ ఫెడరేషన్‌కు ఆకర్షితుడయ్యారు. ఫెడరేషన్‌ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ.. ఇల్లీగల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో చేరారు. ఏఐఎస్‌ఎఫ్‌ కార్యదర్శిగా ఎన్నికై 1948 వరకు పనిచేశారు. విదాభ్యాసం చేస్తున్న విశ్వవిద్యాలయంలోనే స్టూడెంట్‌ నాయకుడిగా పనిచేశారు. అనంతరం ఆయన ట్రేడ్‌ యూనియన్‌లో చురుగ్గా ఉంటూ రైల్వే, టెక్స్‌టైల్స్‌, డిఫెన్స్‌ కార్మికుల హక్కుల కోసం పోరాడారు. విద్యార్థిగా, స్టూడెంట్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా ఆయన చేస్తున్న ఉద్యమాలు కారణంగా బర్దన్‌ పలుమార్లు అరెస్ట్‌ అయి నాలుగన్నరేళ్లు జైలు జీవితం గడిపారు. ట్రేడ్‌ యూనియన్‌ ఆర్గనైజర్‌గా పశ్చిమబెంగాల్ లో పనిచేస్తున్న సమయంలో రెండేళ్లు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ, పలుమార్లు అరెస్ట్‌ అవటంతో చదువుకు ఆటంకం ఏర్పడింది. కష్టనష్టాలను ఎదుర్కొన్నా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ ఎకనామిక్స్‌, ఎల్‌.ఎల్‌.బీ బ్యాచిలర్‌ డిగ్రీ పొందారు. 1957లో మహారాష్ట్ర స్టేట్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1968 నేషనల్‌ కౌన్సిల్‌ పార్టీకి ఎన్నికయ్యారు. 1994లో ఏఐటీయూసీ ఆల్‌ఇండియా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అనంతరం సీపీఐ ప్రధాన కార్యదర్శిగా 1996లో బాధ్యతలు చేపట్టిన ఆయన 2012 వరకు ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించారు.

English summary

Veteran leader of the Communist Party of India (CPI), Ardhendu Bhushan Bardhan, passed away in New Delhi Saturday. At present his age was 92.Bardhan has been a leading figure of the trade union movement and Left politics in Maharashtra. He had won as an Independent candidate in Maharashtra Assembly polls in 1957