'బాహుబలి'  వేస్ట్ మూవీ అని  జమున ఎందుకన్నారు?

Veteran Heroine Jamuna Sensational Comments On Bahubali Movie

09:57 AM ON 25th January, 2016 By Mirchi Vilas

Veteran Heroine Jamuna Sensational Comments On Bahubali Movie

ఒకప్పుడు వెండితెర మీద తన అందాలతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిన జమున చాలా ఏళ్ల నుంచి సినిమాలు చూడడం మానేశారు. కానీ రీసెంట్ గా బాహుబలి గురించి జరిగిన ప్రచారం తో ఆ సినిమా చూశారట. అయితే ఇదో వేస్ట్ మూవీ అన్నారామె. బాహుబలి ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం అందులో ఉన్న సాంకేతిక విలువలు మాత్రమేనని తేల్చేశారామె. 'హీరో ఒక్క పాత్ర తప్పితే మిగతా అన్ని పాత్రలకు నటీనటుల ఎంపిక కూడా సరిగా చేయలేకపోయారు. బాహుబలిలో అనుష్కను హీరోయిన్ గా చేయాల్సి ఉంది'అంటూ జమున చేసిన కామెంట్ ఇప్పుడు రచ్చ రచ్చ అవుతోంది. దేశంలోనే అతి గొప్ప గ్రాఫికల్ వర్క్ మూవీగా చరిత్ర సృష్టించి, టెక్నికల్ గా ఇండియాలో ఎవరూ అందుకోలేనంత స్థాయిలో నిలిచి, అంతర్జాతీయంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటిన సినిమాగా కూడా చరిత్రలో నిలిచిపో తుందని అంతా అనడం విన్నాం. ఇక కలెక్షన్లు కూడా బానే కుమ్మరించింది ఈ సినిమా. అయితే అలనాటి అందాల నటి జమున మాత్రం 'బాహుబలి' ని అలా తీసి పారేసారు.

'ఇప్పటి సినిమాల్లో హీరో పాత్ర ఎంతమంది విలన్స్ ని కొట్టాడు మరెంత మందిని చితక్కొట్టాడు అన్నట్లుగానే ఉంటోంది. ఇక హీరోయిన్స్ ని అయితే కేవలం అందాల ప్రదర్శనకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు' అని జమున కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అయితే.. ఆమెకు బాహుబలి జమున నటించిన కాలంలో ఇంతగా సాంకేతిక విలువలు లేకపోయినా అనేక జానపద చిత్రాలు తీశారు. మాయలు మంత్రాలు ఉన్నా వాటికి మించిన కథాబలం ఉండేది. విఠలాచార్య మూవీలు ఆరోజుల్లోనే చరిత్ర సృష్టించాయి. మరి అలాంటి సినిమాలు చూసిన కళ్ళతో 'బాహుబలి' చూసి పెద్ద బిల్డప్ ఇవ్వాలంటే , కష్టమే కదా. అందుకే ఉన్నది ఉన్నట్టు జమున చెప్పేశారని సినీ విమర్శకుల కామెంట్. ఏది ఏమైనా బాహుబలి -2లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి జమున వ్యాఖ్యలు తెల్పుతున్నాయని సినీ విమర్శకుల భావన.

English summary

Veteran Heroine Jamuna Sensational Comments On Bahubali Movie. She said that it was a waste movie and it was became hit because of the graphics only but not for story.She also said that the characters were in the movie was also not selected according to the picture