కూటికోసం 30 ఏళ్లుగా ఇలా విగ్రహంలా...

Vgp golden beach man

11:55 AM ON 29th November, 2016 By Mirchi Vilas

Vgp golden beach man

కూటికోసం కోటి విద్యలు అన్నారు కదా. పాపం యితడు సజీవ విగ్రహంలా నిలబడ్డాడు. ఏకంగా 30 ఇళ్లనుంచి ఇదే పనిలో నిమగ్నమయ్యాడు. ఇంతకీ ఎక్కడంటే, చెన్నైలోని విజిపి గోల్డెన్ బీచ్ ఎంట్రన్స్ దగ్గర. అవును అక్కడకు వెళితే, పెద్ద తలపాగా, రాజుల కాలం నాటి వస్త్రధారణ, చేతిలో కర్రతో ద్వార పాలకుడిలా ఉన్న విగ్రహం ఒకటి కనిపిస్తుంది. నిజానికి అది విగ్రహం కాదు. జాగ్రత్తగా చూస్తే మనిషని అర్థమవుతుంది. అయితే ఎవరెంతగా పలకరించాలని, చూసినా ఆ మనిషి చలించడు. మూడు దశాబ్ధాలకు పైగా లక్షలమందిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతున్న ఆ సజీవ విగ్రహం పేరు మహ్మద్ రఫీ. ఒకసారి పూర్తివివరాల్లోకి వెళ్తే...

1/8 Pages

అది మద్రాసు పట్టణం. అదేనండి చెన్నైగా మారింది కదా. ముఖ్యమంత్రులు అనేకమంది మారారు. నగరం ఎంతగానో విస్తరించింది. వాటితో ఏమీ సంబంధం లేకుండా ఉన్న చోటే నిలబడి ప్రపంచాన్ని వీక్షిస్తున్న మౌన ప్రేక్షకుడు అతను. పొట్టకూటి కోసం 1982లో మహ్మద్ రఫీ అక్కడ విగ్రహంలా నిలబడటం మొదలుపెట్టాడు. ప్రారంభంలో సందర్శకులు తక్కువగా వచ్చినపుడు పది, 15 నిమిషాలు నిలుచుని, వాళ్లు వెళ్లిపోగానే కూర్చునేవాడట.

English summary

Vgp golden beach man