చైతూకి క్లాస్ పీకిన వెంకీ!

Victory Venkatesh gave class to Naga Chaitanya

05:48 PM ON 3rd May, 2016 By Mirchi Vilas

Victory Venkatesh gave class to Naga Chaitanya

విక్టరీ వెంకటేష్ తన మేనల్లుడు నాగ చైతన్యకి క్లాస్ పీకాడంట. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదులేండి, రీల్ లైఫ్ లో. నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో 'ప్రేమమ్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో చైతు సరసన శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెభాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక గెస్ట్ రోల్ లో నటిస్తున్నారు. ఇందులో చైతూకి క్లాస్ పీకే పాత్రలో వెంకీ నటిస్తున్నాడు. అదీ కూడా చైతూకి ఫేవర్ గా క్లాస్ పీకుతాడట. అదేంటంటే చైతూ స్టూడెంట్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే క్లాస్ లో చైతూ ఏదో అల్లరి చెయ్యడంతో ప్రిన్సిపాల్ చైతూ మావయ్య అయిన వెంకీకి కబురు పంపుతాడు.

అయితే వెంకీ వచ్చి చైతూకి ఏదో చివాట్లు పెడతాడు అని ప్రిన్సిపాల్ అనుకుంటే, వెంకీ మాత్రం చైతూకి ఫేవర్ గా క్లాస్ పీకుతాడు. పిల్లలన్నాక అలాగే సీమటపాకాయల్లా ఉంటారు, పప్పు సుద్దల్లా ఉంటారా? అని ప్రిన్సిపాల్ కి చెప్తాడు. అయినా నీకు అల్లరి చెయ్యాలనిపిస్తే మీ ఫ్రెండ్స్ ని మన ఇంటికి తీసుకోచ్చేయోచ్చుగా అక్కడ ఎంజాయ్ చేద్దాం అని చెప్పి చైతూకి క్లాస్ పీకుతాడట. అదీ అసలు సంగతి.

English summary

Victory Venkatesh gave class to Naga Chaitanya. Naga Chaitanya uncle Victory Venkatesh gave class to him.